సుడిగాలి సుధీర్ సినిమా క‌ళ్లు తెరిపిస్తోందా?

Update: 2022-11-24 03:30 GMT
క‌రోనా త‌రువాత ఆడియ‌న్స్ ఆలోచ‌నా విధానం మారింది. అంతే కాకుండా సినిమా టికెట్ రేట్లు కూడా భారీ స్థాయిలో పుర‌గ‌డం, స‌గ‌టు ప్రేక్ష‌కుడికి థియేట‌ర్ లో సినిమా భారంగా మారింది. దీంతో సెలెక్టీవ్ గా మాత్ర‌మే సినిమాలు చూస్తున్నారు. థియేట‌ర్ల కు పెద్ద‌గా రావడం లేదు. ఓటీటీల ప్ర‌భావం పెరిగిన త‌రువాత ఈ సంఖ్య మ‌రింగా త‌గ్గుతూ వ‌స్తుండ‌టంతో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యే సినిమాలు పెద్ద‌గా ఆద‌ర‌ణ‌కు నోచు కోవ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో కంటెంట్ వున్న సినిమాల‌కే ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌ట్ట‌డం మొద‌లు పెట్టారు.

దీంతో క్రేజీ స్టార్ న‌టించిన సినిమా కూడా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా రాణించ‌డం లేదు. వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డానికి ఆప‌సోపాలు ప‌డాల్సి వ‌స్తోంది. కంటెంట్ లేక‌పోతే చిరు సినిమా అయినా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ విష‌యం `ఆచార్య‌`తో పాటు `గాడ్ ఫాద‌ర్‌` సినిమాల విష‌యంలో రుజువైంది కూడా. అయితే రీసెంట్ గా విడుద‌లైన `కాంతార‌` బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. అంతే కాకుండా ఇందులో న‌టించిన హీరో ఎవ‌రో కూడా తెలియ‌క‌పోయినా సినిమాలో వున్న కంటెంట్ కి ఫిదా అయిన ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

మాస్ బొమ్మ‌గా విడుద‌లైన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల మార్కుని దాటి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇదిలా వుంఏ సుడిగాలి సుధీర్ న‌టించిన మాస్ బొమ్మ `గాలోడు` ఊహ‌కంద‌ని విధంగా వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఈ మూవీపై మౌత్ టాక్ లేదు.. పెద్ద‌గా ప్ర‌చారం చేసింది లేదు కానీ వారం పూర్తి కాకుండానే మూడు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ప‌లువురిని షాక్ కు గురి చేస్తోంది. అట్ట‌ట్ట వున్న ఈ మూవీకే ప్రేక్ష‌కులు ఈ రేంజ్ వ‌సూళ్ల‌ని క‌ట్ట‌బెడితే ఆక‌ట్టుకునే మాస్ బొమ్మ ప‌డితే ఫ‌లితం ఎలా వుంటుందో ఊమించుకోవ‌చ్చు.

అంతే `గాలోడు` సినిమా మ‌న వాళ్ల క‌ళ్లు తెరిపిస్తోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. థియేట‌ర్ లో ఆడియ‌న్స్ చేతి విజిల్స్ వేయించ‌గ‌లిగే మాస్ మ‌సాలా బొమ్మ ప‌డాలే కానీ ఆ లెక్క వేరేలా వుంటుంద‌ని సుడిగాలి సుధీర్ న‌టించిన `గాలోడు` హింట్ ఇస్తోంద‌ని అంటున్నారు. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న చిరు `వాల్తేరు వీర‌య్య‌`, బాల‌య్య `వీర‌చ సింహారెడ్డి` మాస్ జ‌నాల్లో పూన‌కాలు తెప్పించ‌గ‌లిగిలే పోటీలో ఏబొమ్మ వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం గ్యారంటీ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News