హీరోకు అరుదైన వ్యాధి ఉండటం.. దాన్ని తట్టుకుని ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం.. ఇలాంటి నేపథ్యంతో కోలీవుడ్లో ఎక్కువగా సినిమాలు తెరకెక్కుతుంటాయి. ఐతే ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఇప్పుడు ఇలాంటి ఆలోచనతోనే ఓ కథ అల్లాడు. అదే.. కేశవ. ఇందులో హీరోకు గుండె కుడివైపున ఉంటుంది. దాని వల్ల హీరో ఏమాత్రం కంగారు పడ్డా.. ఆవేశ పడ్డా అతడి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. ఇలాంటి జబ్బు ఉన్న వాడు హత్యలు చేస్తూ పగ తీర్చుకోవడం ‘కేశవ’ కథలోని ప్రత్యేకత. ఐతే నిజంగా ఇలా గుండె కుడి వైపున ఉన్న వాళ్లు ఎవరైనా ఉంటారా అని సందేహం కలగడం.. ఇది కేవలం ఒక ఊహ మాత్రమేనేమో అనిపించడం సహజం.
కానీ గుండె కుడి వైపు ఉండి దాని వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తి నిజంగానే ఒకరున్నారట. ఆ వ్యక్తి స్ఫూర్తితోనే సుధీర్ వర్మ ‘కేశవ’ కథ రాశాడట. ‘స్వామి రారా’లో నిఖిల్ ప్రెండుగా కనిపించడంతో పాటు ఆ తర్వాత చాలా సినిమాల్లో కామెడీతో అదరగొట్టిన సత్యకు అన్నయ్య అయ్యే ఓ వ్యక్తికి గుండె కుడి వైపున ఉందట. దాని వల్ల అతను అతను పడే ఇబ్బంది గురించి సుధీర్ కు తెలిసి.. ఆ స్ఫూర్తితోనే ‘కేశవ’ కథ రాశాడట. ఐతే ఈ పాత్ర చేయడం కోసం నిఖిల్.. ఆ వ్యక్తి సలహాలేమీ తీసుకోలేదట. అసలు ఆ వ్యక్తిని నిఖిల్ కలవనేలేదట. ఆ వ్యక్తి ప్రభావం తన మీద ఉండకూడదని.. తన సొంత ఆలోచనలతో ఈ క్యారెక్టర్ చేయాలని నిఖిల్ అలా చేశాడట. ఈ పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని.. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని నిఖిల్ చెప్పాడు.