ఓ సినిమా హిట్టయితే పెద్ద పెద్ద లోపాలు కూడా పక్కకు వెళ్లిపోతాయి. వాటి గురించి చర్చే ఉండదు. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే మాత్రం అంతే సంగతులు. ప్రతి చిన్న విషయం మీద శూల శోధన మొదలుపెట్టేస్తారు. సన్నాఫ్ సత్యమూర్తి విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. ఇందులో హీరోయిన్ సమంతను డయాబెటిక్ పేషెంట్‌గా చూపించడం పెద్ద కంప్లయింటై పోయింది. ప్రమోషన్‌కు త్రివిక్రమ్ వచ్చినా, సమంత వచ్చినా.. అదేంటి హీరోయిన్‌ను షుగర్ పేషెంట్‌గా చూపించారంటూ గుచ్చి గుచ్చి అడిగేస్తున్నారు జనాలు.
అయినా హీరోయిన్‌ను డయాబెటిక్‌గా చూపించడం వల్ల వచ్చిన ఇబ్బందేంటసలు. మన పెద్ద హీరోలెవరూ ఓ పేషెంట్‌ను ప్రేమించకూడదా? అయినా డయాబెటిక్ అన్నది ఈ రోజుల్లో చాలా మామూలు విషయం. ఏదో కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేసి చూశాడు త్రివిక్రమ్. అయినా హీరోయిన్‌కు షుగర్ అన్న విషయాన్ని కామెడీగానే చూపించాడు త్రివిక్రమ్. దాంతో ఏమీ సెంటిమెంటు పండించే ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇక్కడొచ్చిన ఇబ్బందేంటో. హీరోయిన్ క్యారెక్టర్‌ను మామూలుగా చూపిస్తే రొటీన్ అంటారు. ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తే పిచ్చి సందేహాలన్నీ లేవనెత్తుతారు.
ఇంతకుముందు త్రివిక్రమ్ తీసిన జులాయి, అత్తారింటికి దారేది సినిమాల్లోనూ వెతికితే చాలా లోపాలు, ఇబ్బందులు కనిపిస్తాయి కానీ అవి హిట్టయ్యాయి కాబట్టి జనాలు పట్టించుకోలేదు. కానీ సన్నాఫ్ సత్యమూర్తిలో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తున్నారు జనాలు.