గతేడాది మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీ ‘లూసిఫర్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. ఇప్పటికే ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమా బాధ్యతలను స్వీకరించి స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. అయితే తాజా సమాచారం ప్రకారం.. లూసిఫర్ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఒరిజినల్ ‘లూసిఫర్’ రీమేక్ హక్కుల్ని రామ్‌చరణ్ దక్కించుకున్నాడు. ఆయనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. నిజానికి లూసిఫర్ మలయాళం మూవీ తెలుగులో డబ్ అయి విడుదలైంది. కానీ ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేక పోయింది. అయినప్పటికీ ప్రధాన పాత్రను మోహన్‌లాల్ పోషించిన విధానం, బ్రిలియంట్ డైరెక్షన్ విధానం క్రిటిక్స్‌ను బాగా మెప్పించాయి. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘లూసిఫర్’.
మోహన్ లాల్ పోషించిన పాత్ర చిరంజీవికి తెగ నచ్చేసి ఆ పాత్రను పోషించాలని ఆయన తహతహలాడుతున్నారట. అయితే ఒరిజినల్ లూసిఫర్ లో నటి మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే. అయితే తెలుగు వర్షన్ కోసం ఆ పాత్రలో సుహాసిని మణిరత్నం నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక తెలుగు సినీ ప్రేక్షకులు.. మెగాస్టార్ అభిమానులు సైతం ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరంజీవిని చూడాలని కుతూహలం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ సుజీత్ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడని.. హీరో ఎలివేషన్స్ అదిరిపోతాయని సమాచారం. మరి త్వరలో రామ్‌చరణ్ ఈ సినిమా షూటింగ్ డేట్ అఫిషియల్‌గా ప్రకటిస్తాడని సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.