సుకుమార్ -బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఓ వారం పాటు కేరళ లోని అడవుల్లో కొన్ని సన్నివేశాలు తీసారు. కాకపోతే అవి బన్నీ మీద కాదు. మరి కొందరు నటులతో తెరకెక్కించారు. ప్రస్తుతం సుక్కు అండ్ టీం హైదరాబాద్ వచ్చేసింది.
అయితే సినిమాను వీలైనంత తొందర గా కంప్లీట్ చేసే పని లో ఉన్నాడు సుకుమార్. 'రంగస్థలం' తర్వాత ఏడాది గ్యాప్ రావడం, బన్నీ కి మరో రెండు ప్రాజెక్ట్స్ ఉండటం తో జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' కి సంబంధించి ఫైనల్ షెడ్యుల్ పూర్తి చేసే పనిలో ఉన్న బన్నీ ఓ వారం పాటు సినిమాను ప్రమోట్ చేసి వెంటనే సుక్కు సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపోతాడు.
బన్నీ జాయిన్ అయ్యే షెడ్యుల్ ఎక్కడ ఉంటుంది అనే దాని మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు. బహుసా మళ్ళీ కేరళ లోనే షూటింగ్ ఉండచ్చు. ఈ సినిమా ద్వారా సుక్కు శత్రుని కంప్లీట్ గా కొత్త లుక్ లో ప్రెజెంట్ చేసి విలన్ గా చూపిస్తాడనే టాక్ కూడా ఉంది. దీని పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.