అల్లు అర్జున్ ను తక్కువ అంచనా వేశాను

Update: 2021-12-28 14:38 GMT
'పుష్ప' సినిమా కోసం తెరవెనుక ఎంతోమంది కష్టపడి పనిచేశారు. వాళ్లంతా అంతటి అంకితభావంతో పనిచేయడం వల్లనే, సినిమా అవుట్ పుట్ ఆశించిన స్థాయిలో వచ్చింది. దాంతో వాళ్లందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం కోసమే థ్యాంక్యూ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం సెట్ బాయ్స్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎక్కడో ఫారెస్టు ఏరియాలో మారుమూల ప్రాంతానికి వెళ్లి పనిచేయడం మామూలు విషయం కాదు. 'రంగా బ్యాచ్' అని ఒక టీమ్ ఉంది. ఆ టీమ్ 'ఆర్య' సినిమా నుంచి వర్క్ చేస్తోంది.

24 గంటలు ఆలోచిస్తూ కూర్చోవచ్చుగానీ .. శారీరక శ్రమ మాత్రం చేయలేము. వాళ్లు నిద్రపోయిందే లేదు. సెట్ బాయ్స్ కీ .. లైట్ బాయ్స్ కి వీళ్లందరికీ కూడా ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష ఇవ్వదలచుకున్నాను. ఇక విషయానికి వస్తే .. సమంత నా ఫేవరేట్ హీరోయిన్. 'రంగస్థలం' చేసిన తరువాత నెక్స్ట్ మూవీ ఇంకెవరితోను చేయలేనేమో అనిపించింది. నేను చెప్పింది ఈజీగా అర్థం చేసుకుని ఫెర్ఫార్మ్ చేయగలిగేవారు ఎవరా అనుకున్నాను. ఆ లోటును శ్రీవల్లి పాత్రతో రష్మిక భర్తీ చేసేసింది. ఇక నా ఫేవరేట్ ఆర్టిస్ట్ ఫాహద్ ఫాజిల్ తో చేసినందుకు సంతోషంగా ఉంది. ఒక్క తెలుగు ముక్క రాకపోయినా .. ప్రోమిటింగ్ అనేది లేకుండా డైలాగ్స్ చెప్పారు.

ఇక తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా బన్నీ ఛాన్స్ ఇచ్చాడనేది సుకుమార్ ప్రస్తావిస్తూ .. " నా డాళింగ్ బన్నీ గురించి ఎంతగా చెప్పినా తక్కువే. నేను మునిగిపోతుంటే .. అంతా కూడా అలా చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుస్తూనే ఉంది .. నేను మునిగిపోతున్నాను .. అంతా చోద్యం చూస్తున్నారు. ఒకే ఒక్కడు దూకాడు .. పట్టుకుని నన్ను పైకి లేపాడు. అప్పుడు అనుకున్నాను .. యూ ఆర్ మై గాడ్ అని" ఆ మాట వినగానే బన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత మళ్లీ సుకుమార్ మాట్లాడటం మొదలుపెట్టాడు.

చూడటానికి చాలా సరదాగా కనిపిస్తాడు .. అంతే సరదాగా మాట్లాడతాడు. కానీ ఆయనలో ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడు. 'ఆర్య' సినిమాకి నేను ఏది చెబితే బన్నీ అది విన్నాడు. 'పుష్ప' సినిమాకి బన్నీ ఏది చెబితే నేను అది విన్నాను .. అదీ డిఫరెన్స్. ఆయన చాలా కాంప్లెక్స్ ఆర్టిస్ట్ .. లేయర్స్ మిక్స్ చేసి ఒక సీన్ ను ఎలా అల్లుకుంటామో. తన పెర్ఫార్మెన్ ను ఫేస్ మీద అలా అల్లుకుంటాడాయన. ఈ సినిమాను ఒక తెలుగు సినిమాగానే నేను చూశాను. కానీ అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్స్ పట్టుబట్టారు.

అప్పుడు మల్లు అర్జున్ కనుక మలయాళంలో ఆడొచ్చునని అనుకున్నాను. నేపాల్ కి కాపీ పంపించాలని అంతా కంగారు పడుతుంటే, నేపాల్ కి కాపీ ఏంట్రా .. ఎందుకెళుతుందిరా అనుకున్నాను. ప్రింట్స్ బీహార్ వెళ్లిపోవాలి .. యూపీ .. అస్సాం .. వెళ్లిపోవాలి అనుకోవడం విన్నాను. అంతలేదమ్మా అని లోపల నవ్వుకున్నాను. అంటే అల్లు అర్జున్ ను నేను తక్కువ అంచనా వేశానన్న మాట. నా ఫ్రెండే కదా అని నేను లైట్ తీసుకున్నానన్న మాట. కట్ చేస్తే ఎక్కడ చూసినా ఏం ఫిగర్స్ .. ఫస్టు డే ఉండే కలెక్షన్స్ నిన్న ఉన్నాయి. నిజంగా ఇవి ఇంపాజిబుల్ కలెక్షన్స్. ఇక ముంబై వెళ్లి అక్కడి థియేటర్స్ లో సినిమాను చూడాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News