సెంటిమెంటే వర్కవుట్ అవుతంది

Update: 2018-01-31 08:59 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం మూవీ కోసం అభిమానులు ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ మూవీ టీజర్ చూశాక ఈ అభిమానుల ఉత్సాహం రెట్టింపయింది. ఇందులో రామ్ చరణ్ అప్పియరెన్స్ సరికొత్తగా ఉండటం.. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో సినిమాపై బజ్ బాగా పెరిగింది.

రంగస్థలం ప్రధానంగా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ అనేది ఇప్పటికే రివీల్ అయింది. ఇందులో రామ్ చరణ్ బ్రదర్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఇందులో ఆదిది ఆవేశంతో నిండిన నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. కానీ అన్నదమ్ముల మధ్య సెంటిమెంటే ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుందని.. అక్కడి నుంచి సినిమా టర్న్ తీసుకుని రసవత్తరంగా మారుతుందనేది ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్. రంగస్థలం టీజర్ లో కూడా చివరలో రామ్ చరణ్ కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న సీన్ కు అభిమానులు ఇప్పటికే ఫ్లాట్ అయ్యారు.

ఇందులో అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్లకు బేస్ రియల్ లైఫ్ ఇన్సిండెంట్లేనని రంగస్థలం యూనిట్ అంటున్నారు. అది మరెవరి జీవితమో కాదు.. డైరెక్టర్ సుకుమార్ జీవితంలోని సంఘటనలే ఇన్ స్పిరేషన్ గా తీసుకుని కథ మలిచాడని తెలుస్తోంది. అన్నదమ్ముల సెంటిమెంట్ అనేది ఎవర్ గ్రీన్ హిట్ సబ్జెక్ట్. ఇంటలిజెంట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ దానిని మరింత ఎమోషన్ గా తీర్చిదిద్దాడని తెలిసి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న రంగస్థలం  మూవీ మార్చి ఆఖరుకు థియేటర్లకు రానుంది.



Tags:    

Similar News