‘కేశవ’లో సుకుమార్ పాత్ర ఏంటి?

Update: 2017-03-23 08:34 GMT
రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెలుగు సినిమా ప్రియులందరూ ‘కేశవ’ టీజర్ గురించే చర్చించుకుంటున్నారు. ‘కేశవ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు చూసినపుడే జనాల్లో సినిమాపై ఆసక్తి కలిగింది. ఇప్పుడు టీజర్ చూశాక క్యూరియాసిటీ మరింత పెరిగింది. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. ‘కేశవ’ కూడా ఆ కోవలోనే ఓ భిన్నమైన సినిమా అవుతుందనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. ‘స్వామిరారా’తో సర్ప్రైజ్ చేసి.. ‘దోచేయ్’తో నిరాశ పరిచిన సుధీర్ వర్మ ఎంతో కసిగా ఈ సినిమాను రూపొందించినట్లున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా విషయంలో విలక్షణ దర్శకుడు సుకుమార్ పాత్ర కూడా ఉంది.

సుక్కు చేతుల మీదుగానే ‘కేశవ’ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే తన సినిమాలో సుక్కు పాత్ర గురించి వివరించాడు దర్శకుడు సుధీర్ వర్మ. ‘కేశవ’ కథను నిర్మాత అభిషేక్ కంటే ముందు సుకుమార్ కే పూర్తిగా వివరించాడట సుధీర్. ముందు అభిషేక్ కు బ్రీఫ్ గా కథ చెప్పిన సుధీర్.. ఆ తర్వాత సుకుమార్ దగ్గరికెళ్లి పూర్తి స్క్రిప్టును వివరించాడట. సినిమా ఎలా తీయాలనుకుంటున్నది కూడా పూర్తిగా వివరించాడట. అభిషేక్ కు సుకుమార్ తో మంచి సంబంధాలుండటంతో ఆయన సలహా మేరకే సుధీర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడట. సుకుమార్ స్క్రిప్టు విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తాను భరోసాతో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లినట్లు అభిషేక్ కూడా చెప్పడం విశేషం. తమ బేనర్లో తొలి సినిమాను సుకుమారే చేయాల్సిందని.. కానీ కుదర్లేదని.. ఐతే సుక్కు సలహా మేరకే తమ బేనర్లో తొలి సినిమాగా ‘కేశవ’ చేశామని అభిషేక్ వివరించాడు. ఈ సినిమాలో కొన్ని పోర్షన్లను సుధీర్ తనకు ఇప్పటికే చూపించాడని.. అవి అద్భుతంగా వచ్చాయని.. టీజర్ కూడా అదిరిపోయిందని సుకుమార్ కితాబిచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News