రంగస్థలం కథ అందుకే రాసుకున్నా

Update: 2018-03-22 08:25 GMT
సాధారణంగా తన సినిమాల గురించి ఎక్కువ ఎమోషనల్ కాకుండా చాలా బాలన్స్ గా ఉండే సుకుమార్ రంగస్థలం విషయంలో మాత్రం బాగా ఓపెన్ అవుతున్నాడు. అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రమే కాదు సినిమా ప్రమోషన్ కోసం ఇస్తున్న ఇంటర్వ్యూలలో కూడా బయటపడుతోంది. తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడిన సుకుమార్ తాను రంగస్థలం మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నానో చెప్పే ప్రయత్నం చేసాడు. తన బాల్యంలోని జ్ఞాపకాలన్నీ 80 దశకంతోనే ముడిపడి ఉన్నాయని - దూరదర్శన్ లో వార్తలు చూడటం మొదలుకుని రేడియో లో పాటలు వినడం దాకా అన్ని చెప్పుకొచ్చాడు. పుట్టిన ఊళ్ళో చదువు చెప్పిన టీచర్ల జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయన్న సుకుమార్ సిటీ లైఫ్ లోకి వచ్చాక పోగొట్టుకున్న తన ఆత్మను తనతో పాటు ప్రేక్షకులకు కూడా పరిచయం చేసే ఉద్దేశంతోనే రంగస్థలం కథ రాసుకున్నట్టు వివరించాడు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా సుకుమార్ వెల్లడించాడు. ఇంటలిజెన్స్ ఎక్కువగా ఉండే స్టైలిష్ ఎంటర్ టైనర్స్ తీసే తనను ఓ అభిమాని మన నేటివిటీకి తగ్గట్టు సినిమాలు తీయరా అని ప్రశ్నించాడట. అప్పుడు తాను మిస్ అవుతోంది ఏంటో గుర్తించిన సుకుమార్ కు ఈ సంఘటనే రంగస్థలంకు ప్రేరణగా నిలిచిందని చెబుతున్నాడు. తన బాల్యం తాలుకు జాడలు, అనుభవాలు రంగస్థలంలో చూడొచ్చన్న సుకుమార్ రామ్ చరణ్  అద్భుతమైన పెర్ఫార్మన్స్ వెన్నెముకగా నిలుస్తుందని చెప్పాడు. మొత్తానికి తనతో పాటు ప్రేక్షకులను కూడా 1980ల నాటి రోజులకు తీసుకెళ్లబోతున్న రంగస్థలం మరో వారం రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. పాటల వీడియో ప్రోమోలతో పాటు మేకింగ్ బిట్స్ ను యు ట్యూబ్ లో విడుదల చేస్తున్న మైత్రి టీం ప్రమోషన్ విషయంలో స్పీడ్ పెంచింది. సుకుమార్ ఎమోషనల్ గా చెబుతున్న మాటలు ఇప్పటికే ఉన్న అంచనాలు ఇంకాస్త పెంచేలా ఉన్నాయి.
Tags:    

Similar News