రకుల్ ను సుక్కు తెలుగు నేర్చుకోవద్దన్నాడా?

Update: 2016-01-25 09:30 GMT
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు బాగా నేర్చుకునే ప్రయత్నంలో ఉండగా.. సుకుమార్ ఇక చాలు, ఇంతకుమించి నేర్చుకోవద్దు అన్నాడట. రకుల్ ప్రీత్ ‘నాన్నకు ప్రేమతో’ డబ్బింగ్ విని.. ఎన్టీఆర్ వెళ్లి సుకుమార్ కు కంప్లైంట్ చేశాడట. ఇంతకీ సుక్కు రకుల్ కు ఎందుకలా చెప్పాడు? ఎన్టీఆర్ రకుల్ మీద ఏమని కంప్లైంట్ చేశాడు? తెలుసుకుందాం పదండి.

‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్ ప్రీత్ లండన్ లోనే పుట్టి పెరిగే అమ్మాయిగా నటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ తోనే ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నాక.. ఆ పాత్ర తెలుగు స్పష్టంగా పలికితే బాగోదని.. మరీ ఎక్కువ తెలుగు నేర్చుకోవద్దని చెప్పాడట సుక్కు. ఆ తర్వాత డబ్బింగ్ ట్రయల్ కోసం రకుల్ ను పిలిచి.. డబ్బింగ్ ఆర్టిస్టు సాయంతో ఆమెతో డబ్బింగ్ చెప్పించాడట.

ఐతే ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడానికి వచ్చినపుడు.. ఓసారి ఆ అమ్మాయి డబ్బింగ్ రీల్ వేయండి విందాం అన్నాడట. ఐతే అందులో ఆమె డబ్బింగ్ చెప్పిన తీరు చూసి షాకయ్యాడట. పాత్ర ప్రకారం తెలుగు స్పష్టంగా పలకకూడదని సుక్కు చెబితే.. ఆ అమ్మాయి మాత్రం తెలుగు పదాలు స్పష్టంగా మాట్లాడ్డం విని ఆశ్చర్యపోయాడట. తర్వాత సుక్కు దగ్గరికెళ్లి. ‘ఆ అమ్మాయి తెలుగు పదాలు స్పష్టంగా పలికేసింది’ అని కంప్లైంట్ చేశాడట. ఐతే సుక్కు మాత్రం పోనీలే ఏం చేద్దాం అని వదిలేశాడట.

ముందు సుక్కు తన డబ్బింగ్ గురించి చెప్పినపుడు జోక్ చేస్తున్నాడని అనుకున్నానని.. తర్వాత నిజంగానే డబ్బింగ్ ట్రయల్ కు పిలిచినపుడు షాకైపోయానని.. ఒకసారి ట్రయల్స్ లో తన వాయిస్ విని ఓకే అనుకున్నాకే డబ్బింగ్ చెప్పానని రకుల్ వెల్లడించింది.
Tags:    

Similar News