సుకుమార్ పొగిడాడా.. తిట్టాడా?

Update: 2018-03-19 07:11 GMT
‘రంగస్థలం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ తన యూనిట్లోని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాడు. నటీనటుల దగ్గరికి వచ్చేసరికి ఆది పినిశెట్టి ప్రస్తావన వచ్చింది. నాలుగు మాటలు మాట్లాడాడు. ఆ మాటలు విన్నాక ఆదికి ఏమీ అర్థం కాలేదు. తన పక్కనే నిలుచుని ఉన్న బ్రహ్మాజీ చెవికి దగ్గరగా వెళ్లి.. ‘‘పొగిడాడా తిట్టాడా..’’ అని అడగడం.. బ్రహ్మాజీ ‘‘పొగిగాడు పొగిడాడు’’ అంటూ తల ఆడిస్తూ చెప్పడం స్పష్టంగా కనిపించింది. ఇంతకీ ఆదికి అలాంటి డౌట్ వచ్చేలా సుకుమార్ అసలేం మాట్లాడాడు అంటే...

‘‘ఆది మా సినిమా షూటింగుకి వచ్చాడు. షూటింగ్ ఐదు రోజుల తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి.. నేనొచ్చి ఐదు రోజులైంది.. సార్ నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. బాగా చేస్తున్నానా లేదా అన్నది కూడా చెప్పలేదు. ఏమీ అడగలేదు. నా పెర్ఫామెన్స్ ఆయనకు నచ్చలేదా అని అడిగాడట. అతనొచ్చి నాకు చెప్పాక కానీ నేనా విషయం అర్థం చేసుకోలేదు. ఔను కదా.. మనం ఐదు రోజులైనా ఆదితో మాట్లాడకపోవడమేంటి అనిపించింది. ఐతే వాస్తవం ఏంటంటే.. ఆది అంత బాగా పాత్రలో ఒదిగిపోయాడు. అతను బాగా చేయకపోతే కదా.. వెళ్లి ఇలా చెయ్యి అని చెప్పడానికి. పర్ఫెక్టుగా చేస్తుండటంతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది. నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడతను. చరణ్ అన్న పాత్రలో ఆది అంత బాగా చేశాడు’’ అని సుకుమార్ అన్నాడు.

Tags:    

Similar News