కుమారి 21ఎఫ్ మూవీతో నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సుకుమార్.. తన రైటింగ్స్ లో ఇప్పుడు మరో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందిన దర్శకుడు చిత్రానికి ఇప్పుడు ఆడియో లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ సినిమాకు ఒక పెద్ద ప్రత్యేకత ఏంటంటే.. సుకుమార్ అసోసియేట్ అయిన ఒక సినిమాకు తొలిసారి దేవిశ్రీప్రసాద్ సంగీతం లేకపోవడం.
'నేను దేవి కాకుండా ఒక సినిమా చేయడం సాహసమే. ఈ సినిమాకు కూడా నేను అడిగితే చేస్తానన్నాడు కానీ.. తనను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అలాంటప్పుడే సాయి కార్తీక్ కనిపించాడు. చరణ్ ఈ సంగీతం విని.. ఇతన్ని కనుక్కుని మరీ అభినందించాడు. మేమిచ్చిన రూపాయికి సాయి 100 రూపాయల వర్క్ అందించాడు. సారీ సాయి' అన్న సుకుమార్.. 'చరణ్ 8 ఏళ్లు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడ'నే సీక్రెట్ ను కూడా విప్పేశాడు. ఏదేమైనా కూడా కుమారి 21 ఎఫ్ వంటి సినిమాకు దేవిశ్రీ సంగీతమే పెద్ద ప్లస్సయ్యింది. ఆ మ్యూజిక్ లేకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ లేకపోయినా సినిమా ఎక్కేది కాదు. కాస్త బూతు టచ్ ఉన్న సినిమాకు దేవిశ్రీ సంగీతం క్లాసిక్ లుక్ తెచ్చింది. ఇప్పుడు సాయి కార్తీక్ ఏం చేస్తోడో మరి.
నిజానికి ''దర్శకుడు'' సినిమాకు సాయి కార్తీక్ కొట్టిన పాటల్లో.. రెండు పాటలు మాత్రం చాలా బాగున్నాయనే చెప్పాలి. ఇనస్టాంట్ హిట్స్ అవి. 'ఆకాశం దించి మేఘాలతో సెట్ వేస్తా' అనే పాట.. అలాగే 'సండే టు సాటర్డే' అనే మరోపాట.. బాగానే ఎక్కేశాయి. మరి సినిమా మొత్తంగా సాయి కార్తీక్ ఎలా తన మ్యాజిక్ చేశాడో చూడాలి.