దేవికి ఆ సూచన ఇచ్చిన సుకుమార్

Update: 2020-01-16 08:21 GMT
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తెలుగులోనే కాదు.. సౌత్ లోన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు. అయితే ఈమధ్య ఆయన జోరు తగ్గింది. 'రంగస్థలం' తప్ప మిగతా సినిమాలలో ఆయన స్థాయి సంగీతం లేదని విమర్శలు జోరుగా వస్తున్నాయి. పాటలు రొటీన్ గా అనిపిస్తున్నాయి.. ట్యూన్లు కూడా గతంలో విన్నవాటికి దగ్గరగా ఉంటున్నాయనేది సంగీత ప్రియుల కంప్లైంట్. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'సరిలేరు నీకెవ్వరు' కు దేవీ అందించిన సంగీతానికి యావరేజ్ మార్కులే పడ్డాయి. నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభించినా పాటలకు సూపర్ రెస్పాన్స్ రాలేదు.  దీంతో ఇప్పుడు అందరి దృష్టి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే నెక్స్ట్ సినిమాపైనే ఉంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.  సుక్కు సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్.  ఇక సుక్కు-దేవీ-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు రెండూ మ్యూజికల్ హిట్సే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. అయితే దేవీ ప్రస్తుతం ఉన్న ఫామ్ లో అంచనాలను అందుకోగలడా అనేది పెద్ద ప్రశ్న.

ఈ సినిమాకు సంగీతం విషయంలో సుక్కు ఒకటే సూచన ఇచ్చారట. పాటలు ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఉండాలని అయితే.. సౌండ్ మాత్రం రొటీన్ గా ఉండకూడదని కండిషన్ పెట్టారట.  అయితే ఇది దేవీ నుంచి మ్యూజిక్ పిండుకునే టైపు కాదు లెండి. సుక్కు.. దేవీ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ తోనే ఇలా కండిషన్ పెట్టారట. ఏదేమైనా దేవీ కి మాత్రం ఈ సినిమా ఒక లిట్మస్ టెస్ట్ కానుంది.


Tags:    

Similar News