టాలీవుడ్ లో బోల్డ్ సబ్జెక్టులతో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ఇదివరకు పలువురు దర్శకులు ఆ తరహా సబ్జెక్ట్ ల్ని అటెంప్ట్ చేశారు, విమర్శకుల ప్రశంసలు పొందారు. కానీ తాజాగా సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు ఆ ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ విషయం ఇప్పుడు ఎక్కువ హైలెట్ అవుతోంది. బోలెడంత హైప్ వచ్చేసింది. ఆ హైప్ చాలు.. సినిమా గట్టెక్కడానికి.
అయితే ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ లతో సినిమాలు తీసేటప్పుడు చాలా స్ట్రాటజీలు వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్ని మార్కెట్ చేసుకొనే విధానంలో జిమ్మిక్కులు ప్రదర్శించాలి. సినిమా తీసేటప్పుడే ప్రేక్షకుల్లో బోలెడంత హైప్ క్రియేట్ అవ్వాలి. ఆ విషయంలో సుక్కు వందశాతం విజయం సాధించాడు. స్టార్ దర్శకుడిగా పేరు పొందిన ఆయనే స్వయంగా కథని అందిస్తుండటంతో కుమారి 21ఎఫ్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి సినిమాలకి మార్కెట్ జరగడానికి సుక్కు పేరుంటే చాలు. కానీ ఆయన మాత్రం అంతటితో వదిలిపెట్టలేదు. తనతోపాటు దేవిశ్రీ - రత్నవేలులాంటి టాప్ టెక్నీషియన్స్ ని భాగం చేశారు. దీంతో పెద్ద సినిమాకి ఏ స్థాయిలో ఉంటుందో, దానికి ఏమాత్రం తీసిపోనంతగా క్రేజ్ వచ్చేసింది. అందుకే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తొలి రోజే మంచి బజ్ క్రియేట్ అయ్యింది కాబట్టి కుర్రాళ్లు ఈ సినిమాని ఇరగబడి చూసే అవకాశం ఉంటుంది.
ఇదివరకు అచ్చం ఇలాంటి కథలతోనే పి.సునీల్ కుమార్ రెడ్డి సినిమాలు చేశాడు. కానీ ఆయన సినిమాలు ఎప్పడూ ఇంత హైప్ క్రియేట్ చేయలేదు. పేరు పొందిన టెక్నీషియన్ లని ఆ సినిమాల్లో భాగం చేయలేకపోవడమే అందుకు కారణం అని చెప్పొచ్చు. అయితే సుక్కు మాత్రం ఆ తప్పుని చేయలేదు. అదే ఆయన కుమారి విజయరహస్యం అని చెప్పొచ్చు.