సుక్కూ- వీడీ కాంబో.. భార‌త్‌-పాక్ నేప‌థ్యంలో మూవీ!

Update: 2021-01-18 10:10 GMT
సుకుమార్ అంటే క్రియేటివిటీకి మ‌రో పేరు.. విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజీ ఐకాన్‌.. వీరిద్దరి కాంబోలో ఓ మూవీ వ‌స్తే ఎలా ఉంటుంది? అద్దిరిపోద్ది క‌దూ! అయితే.. లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం.. వీరి కాంబోలో భారీ మూవీ తెర‌కెక్క‌బోతోంది. ఓ పీరియాడిక‌ల్ చిత్రాన్ని పాన్ ఇండియ‌న్ రేంజ్ లో ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ట సుక్కూ.

కాగా.. ఈ సినిమా నేపథ్యం గురించి ఒక ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కొచ్చింది. ఇండియా - పాకిస్తాన్ విడిపోయిన కాలం నాటి ప‌రిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ట‌. హై ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

దేశం విడిపోయిన స‌మ‌యంలో పాకిస్తాన్ - ఇండియా మధ్య జరిగిన యుద్ధం కూడా ఈ సినిమాలో కీ రోల్ పోషించ‌నుంద‌ట‌. అప్ప‌టి వార్ లో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశాడ‌నే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఆ జవాన్ పాత్రలోనే విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు.

పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్న ఈ మూవీని దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్లో తెర‌కెక్కించ‌బోతున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా పూర్తవ్వగానే విజ‌య్ సినిమా మొదలుకానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా.. కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. మ‌రిన్ని అప్డేట్స్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.




Tags:    

Similar News