ట్రైలర్ టాక్: వంద మంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్న 'సుల్తాన్'

Update: 2021-03-24 12:53 GMT
కోలీవుడ్ స్టార్ కార్తీ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ''సుల్తాన్‌''. రష్మిక మందన్నా ఈ సినిమాతో తమిళ నాట హీరోయిన్‌ గా అడుగుపెడుతోంది. రెమో' ఫేమ్ బక్కియరాజ్‌ కణ్ణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు - ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా 'సుల్తాన్' ట్రైలర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'అది ఒక ఏనుగు గుంపు.. ఈ గ్యాంగ్ ని ఎదురించో జట్టు కట్టకుండానో ఏమి చేయలేం' అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఓ 100 మంది రౌడీలను ఊర్లోకి రానివ్వడానికి గ్రామస్థులు ఒప్పుకోకపోవడం.. 'వాళ్ళు రౌడీలు కాదు నా అన్నలు' అని కార్తీ చెప్పడం చూస్తుంటే.. ఆ రౌడీలను మంచి మనుషులుగా మార్చడానికి హీరో ట్రై చేస్తుంటాడని అర్థం అవుతుంది. 'రౌడీలయితే భయపడాలా?' అంటూ రష్మిక చెప్పడాన్ని బట్టి చూస్తే ఇందులో ఆమె ఓ రెబల్‌ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'వంద మంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది' అంటూ కార్తీ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

'సుల్తాన్' చిత్రానికి వివేక్‌ మెర్విన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నెపోలియన్ - లాల్ - యోగిబాబు - కేజీఎఫ్ గరుడ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. మొత్తం మీద తాజాగా విడుదలైన ఈ యాక్షన్ పాక్డ్ ట్రైలర్ తో 'సుల్తాన్' సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.

Full View

Tags:    

Similar News