అక్కినేని ఫ్యామిలీ హీరోల్లో ఒకడైన సుమంత్ ట్రాక్.. ప్రస్తుతం అంత సాఫీగా లేదు. కొన్నేళ్లుగా ఓ మాదిరి హిట్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న హీరో సుమంత్. రీసెంట్ గా నరుడా-డోనరుడా చిత్రాన్ని చాలా టైట్ బడ్జెట్ లో ప్లాన్ చేశామని.. క్షణం మూవీని అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్వాలిటీగా తీయడాన్ని చూసి ఇన్ స్పైర్ అయ్యామని సుమంత్ ఓపెన్ గా చెప్పాడు కూడా.
అయితే.. డోనరుడు బడ్జెట్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం బైటకొచ్చింది. వీలైనంత తక్కువలో మూవీ కంప్లీట్ చేయడానికి ఓ బెంజ్ కార్ కూడా హెల్ప్ అయింది. క్షణం మూవీ కోసం సుమంత్ తన బెంజ్ కారును ఇచ్చాడు. క్షణం మూవీలో ఆదాశర్మ.. ఆమె కూతురు ప్రయాణించే సీన్ ఉంటుంది. ఆ బెంజ్ కార్ నుంచే చిన్నారిని కిడ్నాప్ చేస్తారు. ఆ కారును ఇచ్చే సమయంలోనే హాలీవుడ్ టెక్నీషియన్ అయిన సినిమాటోగ్రాఫర్ షానియెల్ డియో గురించి తెలుసుకోవడం.. సినిమా తీస్తున్న బడ్జెట్ గురించి ఇతర విషయాలను తెలుసుకుని ఇన్ స్పైర్ అయ్యాడట సుమంత్
ఇప్పుడు సుమంత్ అనే కాదు.. ఏ హీరో అయినా మినిమం బడ్జెట్ లో సినిమా తీసి.. మంచి వసూళ్లు సాధించడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఓ రకంగా అప్పుడు సుమంత్ బెంజ్ కారు ఇవ్వడమే.. ఇప్పుడు డోనురుడుతో సేఫ్ గేమ్ ఆడేందుకు హెల్ప్ అయిందని చెప్పచ్చు. మరి ఈ హెల్ప్ సక్సెస్ కి కూడా తోడు నిలుస్తుందా లేదా అంటే మాత్రం రేపటి వరకూ ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/