రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సందీప్‌కిషన్. ఈ హీరో అప్ కమింగ్ మూవీ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ తొలి తెలుగు చిత్రాన్ని డైరెక్టర్ డెన్నిస్ జీవన్ రూపొందించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.
ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ ను ఆకర్షించిన ఈ మూవీ.. ఆ తర్వాత రిలీజ్ చేసిన రెండు పాటలతో అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ కూడా బాగానే అట్రాక్ట్ చేసింది. యూట్యూబ్‌లో దీనికి 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకూ సందీప్ సినిమాలకు వచ్చిన వ్యూస్ లో ఇదే అత్యధికం.
దేశంలో క్రీడాకారులకు తగిన గుర్తింపు - ప్రాధాన్యం లభించడం లేదనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా.. ఈ సినిమాను ఫిబ్రవరి 26 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ.. అనివార్య కారణాల వల్ల ఒకవారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా సుందీప్ కిషన్ తన వీపుపై లావణ్య త్రిపాఠిని మోసుకెళ్తున్న చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు. అటు ఆట.. ఇటు లవ్ అండ్ ఎమోషన్ తో ఈ చిత్రం ముందుకు సాగనుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సందీప్ కిషన్ స్వయంగా నిర్మించాడు. టిజి విశ్వ ప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - దయా పన్నెంతోపాటు మరో నిర్మాతగా ఉన్నాడు సందీప్. ఈ చిత్రానికి హిప్హాప్ తమీజా సంగీతం అందించారు.