ఈ హీరో కూడా సొంత దుకాణం..!

Update: 2018-11-23 06:53 GMT
టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల హీరోలు సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ - ఏయన్నార్‌ టైం నుండే హీరోలు నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం ఉన్న యువ స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం మంది నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెల్సిందే. అదే దారిలో యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కూడా నిర్మాతగా మారబోతున్నాడు. కెరీర్‌ ఆరంభంలో మంచి సినిమాలే పడ్డా, ఈ మద్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు. దాంతో సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.

తనకు కెరీర్‌ లో మొదటి బిగ్‌ కమర్షియల్‌ సక్సెస్‌ ను తెచ్చి పెట్టిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌’. ఆ చిత్రం పేరుతో వెంకటాద్రి టాకీస్‌ అనే బ్యానర్‌ ను స్థాపించాడు. ఈ బ్యానర్‌ లో మొదటి సినిమాను కార్తీక్‌ రాజు దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ తెరకెక్కించబోతున్నాడు. సూపర్‌ పవర్‌ ఉన్న ఒక వ్యక్తి చుట్టు తిరిగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కార్తీక్‌ రాజు తమిళ దర్శకుడు అవ్వడంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సందీప్‌ కిషన్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ చిత్రానికి అనీల్‌ సుంకర సమర్పకుడిగా ఉంటాడని తెలుస్తోంది. విభిన్నమైన నేపథ్యం అవ్వడంతో తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని సందీప్‌ కిషన్‌ కోరుకుని వెంకటాద్రి టాక్సీస్‌ ను స్థాపించి మరీ నిర్మిస్తున్నాడు. మరి ఈ చిత్రం సందీప్‌ కిషన్‌ కు నిర్మాతగా తొలి సక్సెస్‌ ను హీరోగా ఒక హిట్‌ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.
Tags:    

Similar News