సినిమా ఎంత బాగా తీశాం అన్నదానికంటే సినిమాను ఎంత బాగా పబ్లిసిటీ చేసి జనాల వద్దకు తీసుకు వెళ్లామా అనేది ఇప్పుడు ముఖ్యం అయ్యింది. ఎంత మంది సినిమా తీసినా కూడా సరైన పబ్లిసిటీ చేయకుంటే ఆ సినిమా వృదా అవుతుంది. ఆ విషయం ఇప్పటికే పలు సినిమాల విషయంలో నిరూపితం అయ్యింది. ఇక మామూలు సినిమాలు చేసినా కూడా పబ్లిసిటీతో బాగా హైప్ తీసుకు వస్తే మంచి ఓపెనింగ్స్ అయినా దక్కడం ఖాయం. అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో కొత్త కొత్త ఆలోచనలతో దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
తాజాగా యువ హీరో సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రంను చేశాడు. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ కథపై నమ్మకంతో స్వయంగా తానే స్నేహితుడితో కలిసి నిర్మించాడు. సినిమాపై చాలా నమ్మకం ఉన్న సందీప్ కిషన్ అండ్ టీం సినిమాకు భారీగానే పబ్లిసిటీ ప్లాన్ చేశారు.
సినిమా గురించి జనాల్లో చర్చ జరగాలనే ఉద్దేశ్యంతో ఒక కాంటెస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మీకు గతంలో ఎప్పుడైనా దెయ్యం కనిపించిందా.. లేదంటే ఎప్పుడైనా హర్రర్ సినిమాలో మాదిరిగా అనుభవంను ఎదుర్కొన్నారా అనే విషయాన్ని సెల్ఫీ వీడియో తీసి పంపించాల్సిందిగా కోరడం జరిగింది. మీ భయాన్ని మాతో షేర్ చేసుకుంటే అందులో కొందరికి మా సినిమా ప్రీమియర్ షో చూసే అవకాశం కల్పిస్తామంటూ పేర్కొనడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఈ కాంటెస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. సినిమా గురించి జనాల్లో చర్చ మొదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.