మరో తెలుగు సినిమా బాలీవుడ్ కు వెళ్తోందోచ్!

Update: 2019-07-16 11:44 GMT
సందీప్ కిషన్ తాజా చిత్రం 'నిను వీడని నీడను నేనే' జులై 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  సందీప్ మొదటిసారిగా నిర్మాత మారి వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.  వరస ఫ్లాపులతో సతమతమవుతున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా పెద్ద రిలీఫ్ ఇచ్చింది.  డీసెంట్ రివ్యూస్.. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ దిశగా దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా బాలీవుడ్ కు పయనం అవుతోందట.  సందీప్ కిషన్ ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.  "స్త్రీ మూవీ నిర్మాతలు.. షోర్ ఇన్ ది సిటీ దర్శకులు.. నా మెంటార్స్.. సోదరులు రాజ్ & డీకె 'నిను వీడని నీడను నేనే' హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నారు.  వారు మా సినిమాను టేకప్ చేసినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్" అంటూ ట్వీట్ చేశాడు.

నిర్మాతగా సందీప్ కిషన్ కు మొదటి సినిమానే ప్రాఫిటబుల్ వెంచర్ గా మారేలా ఉంది. మీడియం బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికే దాదాపు సేఫ్ జోన్ లోకి వచ్చిందని సమాచారం.  ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడుపోయాయనే టాక్ ఉంది.  ఇప్పుడు హిందీ రీమేక్ రైట్స్ కూడా అమ్ముడవ్వడం సందీప్ కిషన్ కు ఫుల్ జోష్ ను ఇచ్చేదే.
Tags:    

Similar News