తొమ్మిదేళ్ల క్రితం ప్రస్థానం సినిమాలో హీరో శర్వానంద్ కు తమ్ముడిగా నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో మెప్పించిన సందీప్ కిషన్ హీరో అయ్యాక కొంత కాలం నిలదొక్కుకుంటాడు అనే రీతిలో కొన్ని సక్సెస్ లు సాధించాడు కానీ అవి ఎక్కువ కాలం అతన్ని నిలపలేకపోతున్నాయి. అదేమి దురదృష్టమో కానీ కొత్త దర్శకులు మొదలుకుని కృష్ణవంశీ లాంటి సీనియర్ దర్శకుల దాకా ఎవరితో చేసినా డిజాస్టర్ అందుకుంటున్న సందీప్ చేతిలో ప్రస్తుతం సినిమాలేవి లేవు . హిందీ దర్శకుడు తీసిన సినిమా ఒకటి షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోవడం లేదు.
ఇక 16 సినిమాతో అందరి దృష్టిలో పడ్డ దర్శకుడు కార్తీక్ నరేన్ తీసిన నరగాసురన్ నిర్మాత గౌతమ్ మీనన్ తో కార్తీక్ విభేదాల వల్ల షూటింగ్ నత్త నడకన సాగుతోంది. అందులో కూడా హీరో సందీప్ కాదు. అరవింద్ స్వామి టైటిల్ రోల్ చేస్తుండగా సందీప్ కిషన్ సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తాడు. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కాక సందీప్ కూడా అయోమయంలో ఉన్నాడు. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేని సందీప్ గెడ్డంతో కనిపిస్తున్నాడు . ఎందుకు పెంచుతున్నాడా అనే డౌట్ లో ఉన్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఈ మధ్య గుబురు గెడ్డం యూత్ హీరోలకు బాగా వర్క్ అవుట్ అవుతోంది. రామ్ చరణ్ రంగస్థలంలో ఈ లుక్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టేసాడు. శ్రీవిష్ణు లాంటి అప్ కమింగ్ హీరోలు కూడా ఇదే అవతారంలో కనిపించబోతున్నారు. సందీప్ కిషన్ కూడా అదే బాటలో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇది సినిమా కోసమా కాదా అనేది పక్కన పెడితే సందీప్ కిషన్ ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నాడు. తమిళ్ లో రెండు మూడు సినిమాలు బాగానే ఆడాయి కానీ మరీ వరస బెట్టి అవకాశాలు తెచ్చేవి కాకపోవడంతో అక్కడ కూడా మార్కెట్ డల్ గానే ఉంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ కు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ని మించే హిట్ ఒకటి రావాలి. కానీ అంత సాహసం చేసే దర్శకుడు నిర్మాత తెలుగు వరకు ఎవరూ కనిపించడం లేదు. మరి కోరుకున్న బ్రేక్ తెచ్చుకుంటాడో లేక ఓవెలుగు వెలిగివేరే వ్యాపకాల వైపు వెళ్లిపోయిన యూత్ హీరోల బ్యాచ్ లో చేరతాడో కాలమే నిర్ణయించాలి.