హీరో సందీప్ కిషన్ కు ఈమద్య కాలంలో సరైన సక్సెస్ పడలేదు. గత రెండేళ్లుగా సందీప్ సినిమాల సంఖ్య బాగా తగ్గింది. ఎట్టకేలకు ఈ యంగ్ హీరో 'నిను వీడని నీడను నేనే' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర మరియు జెమిని కిరణ్ లు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా సందీప్ కిషన్ నిర్మించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సందీప్ కిషన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను నేను వెండి తెరపై చూసుకుని రెండేళ్లు అవుతుంది. ఈ రెండేళ్లు చాలా భారంగా సాగింది. ఆమద్య ఒక సినిమా విడుదల అయిన తర్వాత విదేశాలకు వెళ్లాను. అక్కడ బ్రెయిన్ కాస్త రిఫ్రెష్ అవుతుందని అనుకున్నాను. అయితే తిరిగి వచ్చేప్పటికి చాలా బరువు పెరిగాను. దాంతో మళ్లీ బరువు తగ్గి సినిమా చేసేప్పటికి టైం పట్టింది. తిరిగి వచ్చిన తర్వాత చాలా మందిని కలిశాను. ఆ సమయంలోనే ఒక మేనేజర్ నా గురించి తెలిసిన నిర్మాత వద్ద చెబితే ఆయన ఇంకెక్కడి సందీప్ కిషన్... ఆయిపోయాడు కదా కొత్త హీరోలు చాలా మంది వచ్చారు మరెవ్వరి గురించైనా చెప్పు అన్నాడట.
ఆయన మాటలు నాకు కోపంను తెప్పించలేదు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే ఆయ ఆ మాటలు అనడం వల్లే నేను ఈ సినిమాను నిర్మించాలని భావించాను. మంచి కథను నేను నిర్మిస్తేనే బాగుంటుందని అనుకున్నాను. అందుకే స్నేహితుడు సాయంతో ఈ చిత్రంను నిర్మించాను. ఒక హీరో రెండు సంవత్సరాలు ఖాళీగా ఉండటం అంటే నరకంతో సమానం. ఆ బాధను నేను అనుభవించాను. నా జీవితంలో ఎప్పుడు ఏది చేయాలనేది నేను నిర్ణయించుకుంటాను. ఎవరికి దాన్ని నిర్ణయించే హక్కు లేదు. అవకాశాలు రానప్పుడు మనమే సృష్టించుకోవాలని నేను భావించాను. అందుకే ఈ సినిమా నిర్మాణంకు సిద్దమయ్యానని సందీప్ కిషన్ అన్నాడు.
ఈ సినిమా నిర్మాణంలో నాకు అనీల్ సుంకర గారు మరియు జెమిని కిరణ్ గారు చాలా హెల్ప్ అయ్యారు. ఈ సినిమాను మొదట చూసింది అనీల్ సుంకర గారు. ఆయన ఈ చిత్రాన్ని సమర్పించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలు మానేసి బయటకు వెళ్లే పరిస్థితి వస్తే ఎప్పటికి గుర్తుండే ఒక సినిమా చేసి మరీ బయటకు వెళ్లి పోవాలి. అంతే తప్ప సాదా సీదాగా వెళ్లి పోవద్దు. నా స్నేహితుడు దయా పన్నెం ఈ చిత్రానికి భాగస్వామి. కథ చెప్పిన వెంటనే అతడు నాతో నిర్మించేందుకు ఒప్పుకున్నాడు. సినిమా అంతా పూర్తి అయిన తర్వాత అనుకున్నట్లుగా తీశాం అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంను చాలా నమ్మకంతో చేశాను తప్పకుండా ఇది నా కెరీర్‌లో బెస్ట్ అవుతుందనే నమ్మకం ఉందని సందీప్ కిషన్ అన్నాడు.
కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంను సందీప్ కిషన్ - దయా పన్నెం - విజి సుబ్రహ్మణ్యన్ లు నిర్మించారు. అనీల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జోడీగా అన్య సింగ్ హీరోయిన్ గా నటించింది. రెండేళ్ల తర్వాత రాబోతున్న సందీప్ కిషన్ ఈ చిత్రంతో అయినా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.