యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు కొన్నేళ్లుగా అస్సలు కాలం కలిసి రావడం లేదు. మూడేళ్లుగా తెలుగులో అతను హిట్ ముఖమే చూడలేదు. చివరగా 2015లో వచ్చిన ‘టైగర్’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. తమిళంలో అయినా అతడి సినిమాలో పర్వాలేదనిపించాయి కానీ.. తెలుగులో మాత్రం తీవ్ర నిరాశ తప్పలేదు. ఇప్పుడు అతడి ఆశలు ‘నెక్స్ట్ ఏంటి’ మీదే ఉన్నాయి. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఏమో కానీ... సందీప్ తెలుగులో ఇంకో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. సందీప్ పుట్టిన రోజు సందర్భంగా అతడి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే అతను కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డితో పని చేయబోతున్నాడు.
వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ ను బట్టి ఇది నాగేశ్వరరెడ్డి స్టయిల్లో సాగే కామెడీ మూవీ అని అర్థమవుతోంది. సందీప్ ఇందులో లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. తెనాలి రామకృష్ణుడంటేనే వినోదానికి మారుపేరు. సినిమా కూడా అలాగే ఉంటుందేమో చూడాలి.
ఈ చిత్రంలో సందీప్ సరసన సీనియర్ హీరోయిన్ హన్సిక నటించబోతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రాన్ని ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ బేనర్ మీద అగ్రహారం నాగిరెడ్డి.. సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్.. మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడు రాజసింహ ఈ చిత్రానికి కథ అందించాడు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నాడు.