కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ కు ఈ మధ్య అస్సలు కాలం కలిసి రావట్లేదు. హీరోగా మారిన కొత్తలో సునీల్ మంచి విజయాలే అందుకున్నాడు. కానీ తన కామెడీ ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాలు చేయకుండా పూర్తి స్థాయి మాస్ హీరో అయిపోదామని ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డాడు. మిస్టర్ పెళ్లి కొడుకు.. భీమవరం బుల్లోడు.. కృష్ణాష్టమి.. ఇలా వరుసగా డిజాస్టర్లే పలకరించాయి అతణ్ని. ముఖ్యంగా ‘కృష్ణాష్టమి’ విషయంలో సునీల్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంత పరమ రొటీన్ కథతో సినిమా చేయడమేంటి అంటూ విమర్శకులు తెగనాడారు. సునీల్ హీరోగా కంటిన్యూ కావడం మీదే చాలా వ్యతిరేకత ఉండగా.. ఒకవేళ కంటిన్యూ అయినా కొంచెం భిన్నమైన కథలు ఎంచుకోకుంటే కష్టమని జనాలు తేల్చేశారు.
ఈ నేపథ్యంలో సునీల్ నుంచి రాబోయే తర్వాతి సినిమా ‘జక్కన్న’ విషయంలో కొన్ని ‘కొత్త’ కబుర్లు వినిపిస్తున్నాయి. ‘రక్ష’ ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సునీల్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందట. అసలు తెలుగు సినీ చరిత్రలోనే ఇలాంటి కథతో సినిమానే రాలేదంటున్నాడు ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి. ‘‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథతో వంశీకృష్ణ చాలా ఆసక్తికరంగా రూపొందించాడు.
మా సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ చిత్రంలో అన్ని ఉంటాయి. సినిమా చూస్తూ ప్రేక్షకులు థ్రిల్లవుతారు. అన్ని వర్గా ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది. జూన్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పాడు. ఎవ్వరూ టచ్ చేయని కథ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారంటే సునీల్ ఏదో వెరైటీ స్టోరీనే ట్రై చేస్తున్నట్లున్నాడు. ఇదైనా అతడికి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.