హీరోగా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు కమెడియన్ గా సినిమాలు చేయడం మానేసిన సునీల్ హీరోగా ఆశించిన సక్సెస్ లు రాకపోవడంతో మళ్లీ కమెడియన్ గా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. గత సంవత్సర కాలంగా సునీల్ పెద్దా - చిన్న చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు సునీల్ నటించిన ఏ సినిమా కూడా ఆయనకు కమెడియన్ గా మంచి బ్రేక్ ను తెచ్చి పెట్టలేక పోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయితే సునీల్ కమెడియన్ గా కూడా ఛాన్స్ లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రలహరి' చిత్రంలో మంచి పాత్రను దక్కించుకున్నాడు.
సినిమాలో మంచి పాత్ర దక్కడంతో పాటు, ప్రమోషన్స్ లో కూడా సునీల్ కు మంచి ప్రాముఖ్యత దక్కింది. సునీల్ కమెడియన్ గా ఈ చిత్రంలో నవ్వించబోతున్నట్లుగా ట్రైలర్ లోనే దర్శకుడు చూపించాడు. దాంతో ప్రేక్షకులు సునీల్ పై అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగా సినిమాలో సునీల్ పాత్ర ఉంది. గతంలో మాదిరిగా కాకున్నా, సునీల్ కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు. సునీల్ వచ్చే దాదాపు అన్ని సీన్స్ కూడా కామెడీ పండాయి. దర్శకుడు ప్రత్యేకంగా సునీల్ కోసం అన్నట్లుగా ఆ పాత్రను రాసుకున్నట్లుగా ఉంది. ఆ పాత్రకు సునీల్ పూర్తి న్యాయం చేసి నవ్వించాడు. ఈ చిత్రంతో సునీల్ మళ్లీ ఫామ్ లోకి వచ్నిట్లే - మరింతగా నిరూపించుకునేందుకు సునీల్ కు వరుసగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.