హీరోగా కెరీర్ దాదాపుగా ముగింపు దశకు వచ్చేయడంతో సునీల్ మళ్లీ కామెడీ బాట పట్టక తప్పలేదు. ఐతే ఇప్పుడున్న స్థితిలో కమెడియన్ గా అయినా సునీల్ రాణించగలడా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. హీరో వేషాలేస్తూ వేస్తూ సునీల్ ఇమేజ్ మారిపోయింది. అతడి రూపం మారింది. బాడీ లాంగ్వేజ్ మారింది. డైలాగ్ డెలివరీలో కూడా మార్పు వచ్చింది. ఒక రెగ్యులర్ మాస్ హీరోలా అతను తెరమీద విన్యాసాలు చేశాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. స్టైలింగ్ మీద దృష్టిపెట్టాడు. ఫైట్లు చేశాడు. డ్యాన్సులేశాడు. క్యారెక్టర్లు కూడా పూర్తిగా మారిపోయాయి. కమెడియన్ సునీల్ గా సునీల్ కు జనాల్లో ఉన్న ఇమేజ్ పూర్తిగా చెరిగిపోయింది. అందువల్లే హీరోగా ఒక దశ దాటాక అతను కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేసినా కామెడీ పండలేదు.
ఈ నేపథ్యంలో మళ్లీ కామెడీ క్యారెక్టర్లు చేసినంత మాత్రాన సునీల్ ను జనం ఆదరిస్తారా అన్న సందేహాలు కలిగాయి. అందుకు తగ్గట్లే ‘సిల్లీ ఫెలోస్’ కామెడీ క్యారెక్టర్ చేస్తే జనాలు ఆదరించలేదు. అందులో సునీల్ ను చూస్తే నవ్వేమీ రాలేదు. తమిళంలో అద్భుతంగా పండిన పాత్రలో సునీల్ నవ్వించలేకపోవడం దేనికి సంకేతమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో సునీల్ తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ‘అరవింద సమేత’లో నటించాడు. సిక్స్ ప్యాకులు అన్నీ పోయి దాదాపుగా పాత అవతారంలో కనిపించే ప్రయత్నం చేశాడిందులో. త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ ఏంటో అందరికీ తెలుసు. వినోదం అతడి అతి పెద్ద బలం. గతంలో సునీల్ కోసం అద్భుతమైన పాత్రలు రాశాడతను. కాబట్టి ఇప్పుడు కూడా సునీల్ కోసం మంచి పాత్రే రాసి ఉంటాడని.. కామెడీ పేలిపోతుందని.. ఈ చిత్రంతో సునీల్ మళ్లీ కామెడీ ఇమేజ్ తెచ్చుకుంటాడని అందరూ ఆశించారు. కానీ తీరా సినిమా చూస్తే ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి. సునీల్ తమాషాకు అని ఉండొచ్చు కానీ.. నిజంగా ఇందులో అతను కరివేపాకు లాగే కనిపించాడు. కథలో అతడికి అంత ప్రాధాన్యమున్న పాత్రేమీ కాదు. అతడికి సరైన సీన్ పడలేదు. సునీల్ పాత్రలో కామెడీ టచ్ లేదు. ఏదో ఉన్నాడంటే ఉన్నాడనిపించాడతను. మరి సునీల్ ఆప్త మిత్రుడే ఇలాంటి పాత్ర ఇస్తే.. కామెడీ పండించలేకపోతే మిగతా వాళ్లు అతడినెలా చూపిస్తారన్నది సందేహం. మరి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో శ్రీను వైట్ల.. సునీల్ కోసం ఎలాంటి పాత్ర రెడీ చేశాడో.. అతడినెలా ప్రెజెంట్ చేశాడో?