11 కుటుంబాలు పాపను వద్దన్నాయ్

Update: 2017-08-04 08:33 GMT
బాలీవుడ్ లో ఉన్నవారే  కాదు ఇండియాలో ఏ ఇండస్ట్రి కి వెళ్ళిన సన్నీ లియోన్ పేరు ప్రతి వారు ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. ఆమె సెక్స్ స్టార్ గా,  ఐటెమ్ సాంగ్ డాన్సర్ గా తెలిసిన సన్నీ.. ఈ మధ్యనే తల్లి కూడా అయ్యింది. ఈ మధ్యనే నిషా అనే రెండేళ్ల పాపను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిన్నారిని చూడటానికి చాలామంది వచ్చినా ఏమి చెప్పకుండా వెలిపోయేవారు అంటా.. కానీ సన్నీ లియోనీ ఆమె భర్త మాత్రం వివరాలు ఏమి అడగకుండానే దత్తత తీసుకున్నారట తెలుసా?

మహారాష్ట్రలోని లాతూరుకి చెందిన ఓ అనాథాశ్రమం నుంచి సన్నీ.. ఈ పాప నిషా ని  దత్తత తీసుకుంది. అయితే సన్నీ కన్నా ముందు ఈ పసిపిల్లను చూడటానికి  11 కుటుంబాలు వచ్చాయట. కానీ ఎవరు  దత్తత తీసుకోవడానికి ముందుకు రాలేదట. వచ్చిన ప్రతి వారు అమ్మాయి రంగు చూసి, అమ్మాయి గతం గురించి అడిగి.. చూద్దాం మళ్ళీ వస్తాం అని చెప్పి వెళ్లిపోయేవారట. కానీ సన్నీ మాత్రం పాప ఆరోగ్యం ఎలా ఉంది రంగు ఏంటి ఎక్కడ పుట్టింది ఇవి ఏమి అడగకుండా వెబ్‌ సైట్‌ లో చిన్నారి దత్తతకు దరఖాస్తు చేసుకుంది. చేసుకున్న మూడు వారాలకే వచ్చి నిషాను తీసుకువెళ్లింది అని  కారా అడాప్షన్‌ ఏజెన్సీ వారు చెప్పారు.

“దత్తత తీసుకోబోయేవారు వేసే ప్రశ్నలు ఏవి సన్నీ లియోన్ అడగలేదు. ఆమె కు ఉన్న ఇమేజ్ కు ఆమె వ్యక్తిత్వంకు అసలు పొంతనలేదు. ఆమెకు తన అందం తో పాటు ఆమెలో ఒక అమ్మ కూడా ఉంది'' అని మెచ్చుకుంటున్నారు కారా ఏజెన్సీ వారు.​
Tags:    

Similar News