తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేదా ను హిందీలో హృతిక్ రోషన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. 2017 లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలని చాలా కాలం ప్రయత్నాలు జరిగాయి. కాని అందుకు హీరోలు ఆసక్తి చూపించక పోవడంతో పాటు ఏవో కారణాల వల్ల తెలుగు లో విక్రమ్ వేదా రీమేక్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హిందీలో విక్రమ్ వేదా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఈ సినిమా లో నటిస్తున్నాడు. ఈ రీమేక్ లో సైఫ్ అలీ ఖాన్ మరియు రాధికా ఆప్టేలు కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలే మొదలు అయిన హిందీ విక్రమ్ వేదా మొదటి షెడ్యూల్ ను తాజాగా ముగించారు. 27 రోజుల పాటు మొదటి షెడ్యూల్ కొనసాగింది. ఈ మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేయడం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు హీరోలు ఈ సినిమా లో కనిపిస్తారు. హిందీ రీమేక్ కోసం చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా చేసిన మార్పులు చేర్పులతో ఖచ్చితంగా అక్కడ మంచి ఫీల్ ఉన్న మూవీగా నిలవడంతో పాటు కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఒరిజినల్ వర్షన్ విక్రమ్ వేదాకు దర్శకత్వం వహించిన పుష్కుర్ మరియు గాయత్రిలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ రోషన్ ను డైరెక్షన్ చేయడం పట్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ స్టూడియోను బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు వైనాట్.. ఫ్రైడే ఫిల్మ్స్.. టీ సిరీస్.. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ లు నిర్మిస్తున్నాయి. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలకు సంబంధించిన కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. సినిమాను ఎక్కువ సమయం ఆపకుండా విడుదల చేసేందుకు అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తారీకున హిందీ విక్రమ్ వేదాను విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. తెలుగులో హిందీ లో విజయం సాధిస్తే మళ్లీ రీమేక్ కు సంబంధించిన చర్చలు వచ్చే అవకాశం ఉంది.