ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ జంట వారసురాలు ఆరాధ్య క్యూటెస్ట్ గాళ్ గా అభిమానుల్లో పాపులరైంది. మామ్ ఐశ్వర్యారాయ్ ఫ్యాన్స్ అంతా ఆరాధ్యకు అభిమానులుగా మారారు. ఆరాధ్య వయసు ఇప్పటికి ఎనిమిది. ఈ ఏజ్ లోనే ఇంటర్నెట్ లో ట్రెండింగ్ సెలబ్రిటీగానూ పాపులరవుతోంది. ఇక మామ్ ఐష్ తో పాటుగా ప్రతి ఈవెంట్లోనూ ఆరాధ్య కనిపిస్తూనే ఉంది. ఆ ఫోటోలు అంతర్జాలంలో అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాల్లో ట్రెండింగ్ అవుతూ ఆరాధ్య పాపులారిటీ పెంచుతున్నాయి.
తాజాగా ఆరాధ్య స్కూల్ వార్షికోత్సవం హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో ఆరాధ్య ప్రత్యేకంగా ఓ స్పీచ్ ఇచ్చి అదరగొట్టేసింది. ముఖ్యంగా మన దేశంలో మహిళా సాధికారిత- భద్రత గురించి మాట్లాడి స్ఫూర్తి నింపింది. ఈ స్పీచ్ విన్న తర్వాత ఎవరైనా ఎమోషన్ అవ్వాల్సిందే. ఇక దిశ తరహా ఘటనల అనంతరం ఆరాధ్య లాంటి సెలబ్రిటీ కిడ్ ఈ స్పీచ్ ఇవ్వడంతో అది మరికాస్తా అందరికీ కనెక్టయిపోతోంది.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. స్కూల్ వార్షికోత్సవానికి మామ్ ఐశ్వర్యారాయ్ తో కలిసి ఆరాధ్య విచ్చేసింది. ఆ ఫోటోలో ఆరాధ్య రూపం అందరినీ ఆకర్షించింది. ఆరాధ్య లంగా ఓణీ ధరించి ప్రత్యేకంగా ముస్తాబై ఈ వేడుకకు హాజరైంది. సాంప్రదాయ దుస్తుల్లో ఆరాధ్య ఎంతో క్యూట్ గా ఆకట్టుకుంది. తీర్చిదిద్దిన కాటుక కళ్లు.. ఫంకీ హెయిర్ స్టైల్.. జడలో పూల చెండు.. ఆ ప్రత్యేక వేషధారణ అచ్చం మమ్మీనే తలపిస్తోంది. ఇక ఐష్ ఎంతో సింపుల్ గా పింక్ చుడీదార్ లో కనిపించింది. ఇక ఆరాధ్యను చూస్తుంటే.. టాలీవుడ్ లో క్యూట్ సితా పాప (మహేష్ వారసురాలు) గుర్తుకొస్తోంది కదూ? ఒకే ఏజ్ గ్రూప్ లో ఆ చిన్నారులు ఎంతో క్యూట్ గా కనిపించడం అభిమానుల్ని మురిపిస్తోంది.