మోస్ట్ డేంజరస్ కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్తో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ లాక్ డౌన్ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవడం విశేషం. ఇంట్లో చేసే కొన్ని పనులను సోషల్ మీడియా రూపంలో అభిమానులతో పంచుకుంటూ వారిలో జోష్ నింపుతున్నారు. మీరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి బయటపడేందుకు ఇదే మంచి మార్గం అంటున్నారు. ఈ మధ్యనే యంగ్ హీరోయిన్స్ ఫోటో షూట్లతో కుర్రకారుకి మతి పోగొడుతుంటే.. కుర్ర హీరోలంతా జిమ్, ఎక్సర్సైజ్ లంటూ యూత్ కి సలహాలిస్తున్నారు.
ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు రోజు గడిపే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సినిమా విషయాలతో పాటు కుటుంబ విషయాలను కూడా పంచుతున్నారు. ఆ కోవలోకే వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా లాక్ డౌన్ లో ఉన్న ఆయన రోజుకొక మెమరీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదే విధంగా ఇటీవలే మహేష్ తన కూతురుని సితారను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసాడు. ఆ ఫోటోలో మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత కూడా పక్కనే ఉండి స్మైల్ ఇచ్చిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంతో ప్రేమను తన కూతురి పై కురిపిస్తున్న మహేష్ దంపతులను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.