కోవిడ్ విలయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా సినీపరిశ్రమలకు అశనిపాతంలా దాపురించింది. గత ఏడు నెలలుగా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా మళ్లీ భారీ చిత్రాల షూటింగ్ పునః ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్స్ మూవీస్ కూడా ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వెళుతున్నాయి. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూడా సెట్స్ పైకి రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రజనీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ `అన్నాతై` సెట్లోకి రావడానికి కానీ షూటింగ్ లో పాల్గొనడానికి కానీ ఇష్టపడటం లేదట.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టినా ఆయన మాత్రం సెట్ లో అడుగుపెట్టడానికి అయిష్టతను ప్రదర్శిస్తున్నారట. `సిరుతై` శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా `రోబో` మేకర్ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార..., కీర్తిసురేష్.., మీనా..., ఖుష్బూ.., ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముందు ఈ మూవీ రెగ్యులర్ షూట్ ని ఈ నెల 23 నుంచి ప్రారంభించాలనుకున్నారు కానీ కుదరలేదు. నవంబర్ నుంచి స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించి 40 రోజుల షెడ్యూల్ బ్యాలెన్స్ గా వుంది. నవంబర్ లో షూటింగ్ ప్రారంభించాలనుకున్న నిర్మాత కళానిధిమారన్ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట. కారణం రజనీ అని తెలిసింది. 69 ఏళ్ల రజనీపై 200 మందికి మించి జూనియర్ ఆర్టిస్ట్ ల మధ్య కీలక ఘట్టాల్నిచిత్రీకరించడం ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ సేఫ్టీకి ప్రమాదం కాబట్టి షూట్‌ని క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది. ఇటీవల తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి లెజెండ్ ని పోగొట్టుకున్నాం. కాబట్టి రజనీ విషయంలో అలాంటి తప్పులు జరకూడదనే టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. వచ్చే ఏడాది జనవరిలో రజనీకి సంబంధించిన కీలక ఘట్టాలని షూట్ చేస్తారట.