యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'హే రామ్'. ఈ సినిమా వచ్చి ఇటీవలే 22 ఏళ్లు పూర్తి అయ్యింది. కమల్ హాసన్ విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించాడు.. కాని సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. హే రామ్ సినిమా లో కమల్ హాసన్ మాత్రమే కాకుండా గెస్ట్ రోల్ లో షారుఖ్ ఖాన్ నటించాడు ఇంకా పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమా లో నటించారు. అప్పట్లోనే ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీ గా ప్రచారం జరిగింది. కాని సినిమా ఫలితం తారుమారు అవ్వడంతో జనాలు ఆ సినిమా గురించి పట్టించుకోలేదు. కమల్ హాసన్ కు భారీగా నష్టాలు మిగిలాయి. సినిమా విడుదల అయిన ఇన్నాళ్ల తర్వాత రీమేక్ కు సిద్దం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
హే రామ్ సినిమా రీమేక్ రైట్స్ బాలీవుడ్ నిర్మాత భరత్ సాహ్ అప్పట్లోనే కొనుగోలు చేయడం జరిగింది. ఆయన రీమేక్ చేసేందుకు ధైర్యం చాలక అలా వదిలేశాడు. ఇప్పుడు ఆ రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ బాద్ షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. 22 ఏళ్ల క్రితం తాను గెస్ట్ గా నటించిన సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసి.. ఇప్పుడు దాన్ని రీమేక్ చేసేందుకు సిద్దం అవ్వడం అంటే ఆయనకు ఆ సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా హే రామ్ స్క్రిప్ట్ ను మార్చి సినిమాను పట్టాలెక్కించాలని షారుఖ్ ఖాన్ భావిస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.
షారుఖ్ ఖాన్ జీరో సినిమా తర్వాత ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్నాడు. అందులో రెండేళ్లు తాను తీసుకోవాలని తీసుకుంటే... మరో రెండేళ్లే కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత షారుఖ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమా లు రాబోతున్నాయి. ఇప్పటికే ఆయన నటించిన పఠాన్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందట. మరో వైపు అట్లీ కుమార్ దర్శకత్వంలో సినిమాను కూడా చేయబోతున్నాడు. ఇదే సమయంలో హే రామ్ సినిమా రీమేక్ లో కూడా ఆయన నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. నిర్మాణ రైట్స్ ను కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్ మిగిలిన వివరాలను త్వరలోనే వెళ్లడిస్తాడేమో చూడాలి.