మూణ్నాలుగు వారాలుగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు మెగా అభిమానులు.. సర్దార్ గబ్బర్ సింగ్ మేకింగ్ వీడియోలు.. టీజర్లతో మొదలైన హంగామా ఆ తర్వాత ఆడియో వేడుకతో పీక్స్ కు చేరుకుంది. తర్వాత ‘సరైనోడు’ ఆడియో హుషారు మొదలైంది. ఆపై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రిలీజైంది. ఇక నిన్నే ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ మీట్ మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఈ వేడుక ఇంకా వెంటాడుతుండగానే.. మరో మెగా ఫంక్షన్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 14నే మెగా యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సుప్రీమ్’ ఆడియో వేడుక జరగబోతోంది. ఈ రోజే ఈ న్యూస్ కన్ఫమ్ చేస్తూ దిల్ రాజు ఆడియో పోస్టర్ రిలీజ్ చేశాడు.
సాయిధరమ్ తేజ్.. రాశి ఖన్నా కలిసి యమ స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్లో అసలైన హైలైట్ వెనుక ‘ఎస్’ అక్షరంతో తయారు చేసిన లోగోనే. చాలా స్టైలిష్ గా.. ఐపీఎల్ టీం ‘సన్ రైజర్స్’ లోగోను గుర్తుకు తెచ్చేలా వైబ్రంట్ గా దీన్ని డిజైన్ చేశారు. టైటిల్ లోగో కూడా బాగుంది. ‘డోంట్ సౌండ్ హార్న్’ అనేది ‘సుప్రీమ్’ ట్యాగ్ లైన్. ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య రిలీజైన టీజర్ మెగా అభిమానుల్ని బాగా అలరించింది. సాయికార్తీక్ అందించిన ఆడియోను ‘ఆదిత్య మ్యూజిక్’ విడుదల చేయబోతోంది. ఆడియో వేదిక ఏదో ప్రకటించలేదు. బహుశా శిల్పకళా వేదికలోనే ఉండొచ్చేమో. మరి పవన్.. బన్నీల వేడుకలకు అతిథిగా వచ్చిన చిరంజీవి తన మేనల్లుడి కోసం వస్తాడో రాడో చూడాలి.