వాళ్లు పెయింటర్ అంటే..నేను యాక్టర్ అయ్యా!

Update: 2020-04-18 02:30 GMT
అందమైన కళ్ళు - పాల చెక్కిళ్ళ చెన్నై సుందరి సురభి. తెలుగుతెరకు పరిచయం అక్కర్లేని పేరు. అందంతో అభినయంతో ఎప్పటికప్పుడు తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. కానీ అందరు హీరోయిన్ల లాగే సురభి కూడా మొదట్లో మంచి తెలుగుతనం నిండిన పక్కింటి అమ్మాయిలా కనిపించింది. వరుస సినిమాలతో జోరుమీద ఉన్నప్పుడే గ్లామర్ పాత్రలు చేస్తూ - అందాల విందును ప్రారంభించింది. కానీ ఎంత అందం గుప్పించినా సురభికి అవకాశాలు ఎందుకు కరువయ్యాయో జవాబు తెలియని ప్రశ్న.

మొదట తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ. బీరువా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాలోనే ఆమె అందానికి - అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్స్ రాజా - నానితో జెంటిల్ మెన్ చిత్రాలతో పాటు కొన్నిసినిమాలలో నటించినా ఈ బొద్దుగుమ్మకు పెద్దగా పేరు రాలేదు. లాభం లేదని ఒక్కక్షణం సినిమాలో గ్లామర్ డోస్ పెంచి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అవకాశాల పరంగా అయినా ఫేట్ మారలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సురభిని హీరోయిన్‌ అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా? అని ప్రశ్నిస్తే చాలా సింపుల్ గా జవాబిచ్చింది. ‘‘నిజానికి నాతో పాటు మా పేరెంట్స్‌ కూడా ఎప్పుడూ అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవితం కదా! నా చిన్నప్పుడు సంగీతం మీద నా ఆసక్తి చూసి.. ‘మా అమ్మాయి భవిష్యత్‌ లో మ్యూజీషియన్‌ అవుతుంది’ అనుకున్నారట మా పేరెంట్స్‌. బొమ్మలు వేయడం చూసి.. ‘పెయింటర్‌ అవుతుందనుకున్నారు.

 కానీ ‘నువ్వు ఇది కావాలి అది మాత్రమే చదవాలి’ అని ఎప్పుడూ బలవంత పెట్టలేదు అంటుంది. మా పేరెంట్స్‌ అడ్వర్‌ టైజింగ్‌ రంగానికి చెందినవారు. ఆ క్రియేటివ్‌ జీన్స్‌ నాకు వచ్చాయేమో. నేను హీరోయిన్‌ అయ్యేంత వరకూ నాకూ తెలియదు. నేను నటిని అవుతానని. అలా అనుకోకుండా నటిని అయ్యాను. ఈ రంగం నచ్చి ఇక్కడే కొనసాగుతున్నాను. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్నినెలలు నటనలో శిక్షణ తీసుకున్నాను. కెరీర్‌ పరంగా అది నాకు బాగా ఉపయోగపడింది’ అని సురభి చెప్పుకొస్తుంది.
   

Tags:    

Similar News