రేసుగుర్రం చిత్రంతో 60కోట్ల క్లబ్ డైరెక్టర్ గా సురేందర్‌రెడ్డి పేరు మార్మోగిపోయంది. బన్నీని ఫక్తు కమర్షియల్ హీరోగా చూపించి శభాష్ అనిపించుకున్నాడు. అందుకే ఇక వెనుతిరిగి చూడకుండా చరణ్ సూరీతో సినిమాకి హామీ ఇచ్చాడు. కథ రెడీ చేసుకో. ఇక ముందుకు వెళ్లడమే అని ఫైనల్ చేసేశాడు. ఆ తర్వాత సురేందర్‌రెడ్డి చడీ చప్పుడు లేకుండా తన పనిలో తాను మునిగిపోయాడు.
ఎట్టకేలకు అతడు స్క్రిప్టు రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. చెర్రీ ఎప్పుడు ఊ అంటే అప్పుడు సెట్‌కి వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. అయితే ప్రస్తుతం చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇది పూర్తవ్వడానికి టైమ్ పడుతుంది. అందుకే సూరీని ఓ ఆర్నెళ్ల పాటు వెయిట్ చెయ్యమని అన్నాడు. అయితే ఈలోగానే సురేందర్‌రెడ్డి ఓ చిన్న సినిమాతో బిజీ అయిపోతున్నాడన్న ప్రచారం సాగింది.
ఏదేమైనా ఇప్పుడు చెర్రీతో కమిట్మెంటుకి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. అక్టోబర్ నుంచే చరణ్ కాల్షీట్లు రెడీ. నవంబర్‌లో సూరితో రెగ్యులర్ షూటింగుకి వెళ్లడమే తరువాయి. అక్టోబర్‌లో లాంఛనంగా సినిమా ప్రారంభించేసి, ఈలోగానే మెగాస్టార్ నటించే 150వ సినిమా పనులు చక్కబెట్టుకుని, అట్నుంచి తన సినిమా కోసం సూరీతో రంగంలోకి దిగిపోతాడన్నమాట! దటీజ్ ది డీల్.