ఆ క్యారెక్టర్ వెనుక నిజాలు తెలిశాయ్

Update: 2016-12-06 11:30 GMT
ఈ శుక్రవారం రిలీజవ్వనున్న 'ధృవ' సినిమాపై అంచనాలు భాగానే పెరిగాయ్. అయితే ఈ సినిమాలోని అరవింద్ స్వామి క్యారెక్టర్ విషయానికొస్తే అదే టైపులో చాలా సందేహాలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్‌ స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకుని.. అరవింద్ స్వామి రోల్ తాలూకు లెంగ్త్ తగ్గించేశారని.. కోతలు కోశారని.. ఆ కారణంగా సినిమా ఫ్లాపయ్యే ఛాన్సుందంటూ చాలా అనాలసిస్ లు కూడా వినిపించాయి. ఇంతకీ అదంతా నిజమేనా??

''అబ్బే అదేం లేదు. అసలు అరవింద్ స్వామి క్యారక్టర్ లెంగ్త్ తగ్గించడం కాదు.. ఈ సినిమాలో ఆయన లెంగ్త్ ను పెంచాను. ఒరిజనల్ లో ఉన్న క్యారక్టర్ డిజైన్ కంటే ఇంకా చాలా ఎనహాన్స్ చేయాల్సి వచ్చింది. చరణ్‌ రోల్ ను బాగా పవర్‌ ఫుల్ గా తీర్చిదిద్దడం వలన.. ఇప్పుడు అరవింద్ స్వామి రోల్ ఇంకా బాగా డిజైన్ చేశాం. ఆ మార్పులతో ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు'' అంటూ వివరించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఇప్పుడు ఈ దర్శకుడు ఇచ్చిన క్లారిటీతో ఆ క్యారక్టర్లో కోత లేదనే విషయం అర్ధమైపోయింది. మనోడు తదుపరి మాట్లాడుతూ.. తమిళ సినిమా కంటే చాలా ఎక్కవపాళ్ళు స్టయిలిష్ గా.. అలాగే చాలా ఎక్కువపాళ్ళు ఇంటెన్స్ గా ఈ తెలుగు వర్షన్ ఉండనుందట. డిసెంబర్ 9న ధృవ రిలీజవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News