సినీ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది : స్టార్ ప్రొడ్యూసర్

Update: 2020-06-30 15:05 GMT
కరోనా కారణంగా ఇప్పుడే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమా మంచి రివ్యూస్ పొంది ఇటీవల ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు వెబి నార్‌ లో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’కు ఓటీటీలో స్పందన బావుంది. ఈ జనరేషన్‌ కి సంబంధించిన కథ కాబట్టి ఓటీటీకి బావుంటుందని ఇలా విడుదల చేశాం. నెట్‌ ఫ్లిక్స్‌ లో సినిమా రిలీజ్‌ అయితే ఇతర భాషల ఆడియన్స్ కు బాగా చేరువవుతుంది. సినిమాను జూలై 4న ‘ఆహా’లో కూడా విడుదల చేస్తున్నామని.. ‘ఆహా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతుందని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా అందరూ ఓటీటీలో సినిమాలు చూస్తారని చెప్పలేం. ఏడాది సబ్‌ స్ర్కిప్షన్‌ తీసుకోవడానికే ఆడియన్స్ చాలా ఆలోచిస్తున్నారు. ప్రతి చిన్న సినిమా ఓటీటీలో సక్సెస్‌ అవుతుందని చెప్పలేం. రాజమౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాను ఓటీటీలో వదులుతా అంటే ఎంత ఖర్చు చేసైనా చూస్తారు. అది కంటెంట్‌ మీద ప్రేక్షకుడి అభిరుచి మీద ఆధారపడి ఉంటుదని.. ఇక రామ్‌ గోపాల్‌ వర్మకి ధైర్యం ఎక్కువ. ఓటీటీనే కాదు ఆయన ఏ మాధ్యమంలో రిలీజ్‌ చేసినా డబ్బులు తెచ్చుకోగలడని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినీ రంగానికి చాలా బ్యాడ్ టైమ్ న‌డుస్తుందని.. ఇంకా ఎంతకాలం ఈ ప‌రిస్థితి ఉంటుంద‌నేది ఇప్పుడే చెప్పలేం. ఏడాది పాటు చాలా ఇబ్బందులకు రెడీగా ఉండాల‌నేది నా అభిప్రాయం. క‌రోనా మెడిసిన్ - వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత దాని వల్ల అంతా క్యూర్ అవుతుంది. అప్పటి వరకు సినీ ఇండ‌స్ట్రీకి ఈ స‌మ‌స్య ఉంటుంది. సినీ ఇండ‌స్ట్రీకే కాదు మీడియా టూరిజం ఇలా చాలా రంగాలు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సిందే అని సురేష్‌ బాబు తెలిపారు.
Tags:    

Similar News