నిఖార్సైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్యకు అవి ఎంతకూ తీరడం లేదు. మాస్ ని టార్గెట్ ని చేసి శైలజారెడ్డి అల్లుడు చేస్తే ఓపెనింగ్స్ వచ్చాయి కాని వాటిని నిలబెట్టుకునే కంటెంట్ లేక నిరాశ ఎదురైంది. పోనీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ట్రై చేద్దామని సవ్యసాచి వదిలితే ప్రెజెంటేషన్ తేడా కొట్టి ఫలితం కూడా అలాగే దక్కింది. అందుకే తన కొత్త సినిమాల విషయంలో తొందరపడకుండా కాస్త ఆచితూచి అడుగు వేయాలని కోరుతున్నారు అభిమానులు. నాన్న నాగ్ ఎంత అండదండలు అందించినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కపోవడంతో ఇప్పుడు ఇద్దరు మేనమామలు రంగంలోకి దిగారు.
వెంకటేష్ కెరీర్ మొదలుపెట్టంది కలియుగ పాండవులతో. ఆ సమయానికే సురేష్ బాబు నిర్మాణ విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ్ముడికి సూటయ్యే కథలను ఎంచుకుని దర్శకులను సెట్ చేసే విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రేమ-బొబ్బిలి రాజా లాంటి సూపర్ హిట్స్ ని అందించి త్వరగా స్టార్ అయ్యేందుకు దోహద పడింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సైతం కలిసుందాం రా లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ వెనుక ఉన్నది సురేష్ బాబే.
రానాకు నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ దక్కడంలో ఆయన పాత్ర గురించి ఇప్పటికీ టాక్ ఉంది. అందుకే చైతుకి సైతం అలాంటి ఓ మేజర్ బ్రేక్ వచ్చే ఉద్దేశంతోనే వెంకీ మామకు సంబందించిన అన్ని విషయాల్లోనూ తన ప్రమేయం ఉండేలా చూస్తున్నారట సురేష్ బాబు. జై లవకుశ దర్శకుడు బాబీ ఏడాది గ్యాప్ వచ్చినా దీని మీదే వర్క్ చేస్తున్నాడు. ఇద్దరు మామల అండతో చైతు ఈ సారి గట్టి హిట్ కోడతాడేమో చూడాలి
వెంకటేష్ తో చైతు కలిసి చేయబోయే వెంకీ మామ(వర్కింగ్ టైటిల్) రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. మరోపక్క సురేష్ బాబు దీని స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిది క్షుణ్ణంగా చూసి పూర్తి సంతృప్తి చెందితే కాని ఓకే చెప్పడం లేదట. దాని వల్లే ఆలస్యం అవుతోందని ఇన్ సైడ్ టాక్.