సురేష్‌ బాబుకు గెలిచే ఛాన్సుందా???

Update: 2015-07-19 10:20 GMT
మొన్న ఎలాగైతే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వారికి ఎన్నికలు జరిగాయో  ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌ అలాగే ''తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌'' వారికి కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ కేవలం ఒక్కోసారి ఒక్కో ఏరియా నుండి ఒక్కో వ్యక్తిని తమ అద్యక్షుడిగా ఎన్నుకుంటూ వచ్చింది ఛాంబర్‌. ఒకసారి ఆంధ్ర నుండి, ఒకసారి తెలంగాణ, ఒకసారి సీడెడ్‌ నుండి ఎన్నుకున్నారు. ఒకసారి ప్రొడ్యూసర్ల నుండి, ఒకసారి డిస్ట్రిబ్యూటర్ల నుండి మరోసారి ఎగ్జిబిటర్స్‌ నుండి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. కాని ఈసారి సీన్‌ మారింది.

ఆంధ్రప్రదేశ్‌ రెండు ముక్కలుగా విడిపోవడంతో ఈసారి ఎపి ఫిలిం ఛాంబర్‌ ను ''తెలుగు ఫిలిం ఛాంబర్‌''గా పేరు మార్చడమే కాదు.. ఈ తెలుగు ఛాంబర్‌ కు ఇప్పుడు ఏ స్టేట్‌ వారు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అనేది అసలు క్వశ్చన్‌. నిజానికి ఈసారి నైజాం నుండి ఒక వ్యక్తిగా ఎన్నుకోవాల్సి ఉన్నా.. ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయాలు, పవర్‌ పాలిటిక్స్‌ దృష్ట్యా అందరూ నిర్మాత సురేష్‌ బాబునే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చూస్తున్నారు. అందుకే ఇప్పుడు సురేష్‌ బాబు, అలాగే నైజాం నుండి ఏసియన్‌ సినిమాస్‌ అధినేత డిస్ట్రిబ్యూటర్‌ నారాయణ దాస్‌ బరిలో ఉన్నారు. ఒక రెబెల్‌ అభ్యర్దులుగా ప్రసన్న కుమార్‌, నట్టి కుమార్‌ కూడా పోటీచేస్తున్నారు. అలాగే నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి కూడా ఛాంబర్‌ అధ్యక్షుడు కావాలని ఆశపడుతున్నారు. వీళ్లలో ఎవరు గెలుస్తారు?

కాస్త సరిగ్గా క్యాంపెయిన్‌ చేసుంటే సురేష్‌ బాబే గెలుస్తారేమో.. కాకపోతే ఈయన ' ఆ నలుగురు'లో ఒకడు అనే రిమార్కు ఉంది కాబట్టి గెలుస్తాడా గెలవడా అనే సందేహం ఉంది. ఈ రోజే ఫిలిం ఛాంబర్‌లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
Tags:    

Similar News