మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్న సురేష్ బాబు..!

Update: 2021-06-02 13:37 GMT
ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోగలిగే మంచి కంటెంట్ తో వస్తే లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పటికే అనేకమంది దర్శకులను నటీనటులను ఇతర సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అలానే రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు సురేశ్ బాబు రామానాయుడు ఫిలిం స్కూల్ పూర్వ విద్యార్థులను డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.

రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే యువకుడిని దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక ఉత్కంఠ భరితమైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో దగ్గుబాటి హీరోలెవరైనా నటిస్తారా లేదా కొత్త వాళ్ళతో వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇచ్చి, ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

ఇకపోతే సురేష్ బాబు ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో 'అసురన్' రీమేక్ ‘నారప్ప’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే మలయాళ హిట్ సినిమా ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ ని కూడా రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రానా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రాన్ని సమర్పిస్తున్నారు సురేష్ బాబు. వీటితో పాటుగా డిజిటల్ కంటెట్ ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Tags:    

Similar News