వెంకీమామ షిఫ్ట్ వెన‌క అంత క‌థ ఉందా?

Update: 2019-11-29 04:27 GMT
విక్ట‌రీ వెంక‌టేష్- నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన వెంకీమామ రిలీజ్ ఎప్పుడు?  గ‌త కొంత‌కాలంగా రిలీజ్ ప్లాన్ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుండ‌డంతో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌హా కామ‌న్ ఆడియెన్ లో క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. అక్టోబ‌ర్ అనుకున్నారు కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత‌ సంక్రాంతి రిలీజ్ మిస్ ఫైర్ అయ్యింది. డిసెంబ‌ర్ 13 అన్నారు. అది కాస్తా క్రిస్మ‌స్ కి షిఫ్ట‌య్యింది. ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 25 అయినా ఫైన‌ల్ అయ్యిందా? అంటే అందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదింకా.

అయితే ఈసారి డిసెంబ‌ర్ 25 తేదీనే ఫైన‌ల్ చేస్తున్నార‌న్న ఎక్స్ క్లూజివ్ స‌మాచారం ఉంది. ఈ షిఫ్ట్ వెన‌క చాలా పెద్ద ప్లాన్ ఉంద‌ని తెలిసింది. డిసెంబ‌ర్ 13న రిలీజ్ చేస్తే ఆ త‌ర్వాత‌ ఏడు రోజుల‌కే రెండు పెద్ద సినిమాలు వ‌స్తున్నాయ్. దీంతో సురేష్ బాబు థియేట‌ర్స్ ని వాళ్ల‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్లాన్ ఛేంజ్ అయ్యింది. ప్ర‌స్తుతానికి డిసెంబ‌ర్ 13న డిస్ట్రిబ్యూష‌న్ కి అంగీక‌రించిన చిన్న సినిమాల్ని వ‌దిలేస్తున్నార‌ట‌.

డిసెంబ‌ర్ 20న రానున్న భారీ చిత్రాల్ని కూడా త‌న థియేట‌ర్ల‌లో వేసుకుని వాటి వేడిని కూడా డిసెంబ‌ర్ 25 వ‌చ్చేప్ప‌టికి త‌గ్గించేస్తారు. క్రిస్మ‌స్ నాటికి ఫ్రెష్ గా వెంకీమామ బ‌రిలో దిగుతుంది. అంటే ఆడియెన్ ఫ్రెష్ మైండ్ తో వేరే పోటీ అన్న‌ది ఏదీ ఆలోచించకుండా వెంకీమామ థియేట‌ర్ లో అడుగు పెడ‌తాడ‌న్న‌మాట‌. క్రిస్మ‌స్ పండ‌గ మొద‌లు.. సంక్రాంతి పండ‌గ వ‌ర‌కూ వెంకీమామ‌ను సురేష్ బాబు త‌న థియేట‌ర్ల‌లో ఆడించేయాల‌నే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఇటు క్రిస్మ‌స్ సెల‌వులు.. కొత్త సంవ‌త్స‌రం సెల‌వు (జ‌న‌వ‌రి 1) అటుపై సంక్రాంతి సెల‌వులు ఇన్నిటిని క‌వ‌ర్ చేయాల‌ని ప్లాన్ చేశారు. మంచి రిలీజ్ తేదీ చూస్కొని అంటే వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టే తేదీల్ని చూసుకుని వ‌ద‌ల‌డం అని అర్థం. దీనిని తూ.చ త‌ప్ప‌క ఆచ‌రిస్తూ మార్కెట్‌ గురూ అనిపిస్తున్నారు డి.సురేష్ బాబు. ఇక వెంకీ మామ బ‌డ్జెట్ ఇప్ప‌టికే అనుకున్న‌దానికి రెట్టింపు అయ్యింది కాబ‌ట్టి ఆ మొత్తాన్ని భారీ ఓపెనింగ్స్.. లాంగ్ ర‌న్ తో రాబ‌ట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News