సురేష్‌ బాబు పంచ్‌ దాసరికేనా??

Update: 2015-11-18 05:33 GMT
ఎప్పుడూ అవే మొహాలు.. కొత్తవాళ్లని రానివ్వరా అంటూ.. దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పంచ్ డైలాగ్ వేస్తాడు. కానీ ఇది కామెడీ కౌంటర్. టాలీవుడ్ లో ఆ నాలుగు కుటుంబాల నుంచే హీరోలు వస్తున్నారు.. వాళ్లనే మళ్లీ మళ్లీ రుద్ది చూపిస్తున్నారు.. కొత్త వాళ్లను రానివ్వడం లేదు, ఎదగనివ్వడం లేదు.. ఇది ఇండస్ట్రీ పెద్దగా భావించే దాసరి నారాయణరావు చాలాసార్లు పబ్లిక్ గా ఇచ్చిన స్టేట్ మెంట్.

దీనికి కౌంటర్ గా వేశాడో, లేక మామూలుగానే చెప్పాడో కానీ.. దగ్గుబాటి నిర్మాణ వారసుడు - బడా నిర్మాత అయిన సురేష్ ఓ పెద్ద డైలాగ్ పేల్చాడు. 'నటులు నాని - రాజ్ తరుణ్ లు వాళ్ల సొంత ట్యాలెంట్ తోటి హీరోలయ్యారు. రామ్ మోహన్ వాళ్లను  పరిచయం చేశాడు. కాబట్టి.. ఇలాంటి సొల్లు కట్టిబెట్టి ఏమన్నా సొంత పనుంటే చూసుకోవడం బెటర్'. ఇదీ సురేష్ బాబు అన్న మాట. అష్టాచెమ్మా - గోల్కొండ  హైస్కూల్ - ఉయ్యాల జంపాల చిత్రాలను నిర్మించిన రామ్ మోహన్.. ప్రస్తుతం తను నేను అనే ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 27 న రిలీజ్ కానున్న ఈ మూవీలలో సంతోష్ శోభన్ - అవికా గోర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ అందించింనది రామానాయుడు ఫిలిం స్టూడియో స్టూడెంటే. అంతే కాదు.. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో కొత్త హీరో అయినా రిలీజ్ చేస్తున్నట్లు చెబ్తున్నాడు సురేష్ బాబు.

ఇప్పుడా మూవీ ప్రమోషన్ లోనే.. ఈ కీలక కామెంట్స్ చేశాడు. థియేటర్లు గుప్పిట్లో పెట్టుకున్నారన్న కామెంట్స్ పై కూడా కరెక్ట్ గా మాట్లాడింది ఈయనే. ఇప్పుడు ఫ్యామిలీ హీరోలు అనే కాన్సెప్ట్ కి కౌంటర్ బాగానే ఇచ్చాడు సురేష్ బాబు.. మరి దాసరి వారు ఏమంటారో?
Tags:    

Similar News