మూవీ మొఘ‌ల్ చివ‌రి కోరిక ఇదే!

Update: 2019-12-08 05:26 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డ‌డంలో అగ్ర‌నిర్మాత మూవీ మొఘ‌ల్ డా.రామానాయుడు కృషి మ‌రువ‌లేనిది. హైద‌రాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ ని స్థాపించ‌డ‌మే గాక
ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌ర‌మైన ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ని నెల‌కొల్ప‌డం వ‌ల్ల‌నే ఇక్క‌డ ఎన్నో సినిమాలు తెర‌కెక్కాయి. రామానాయుడు స్టూడియోస్ తో పాటు అన్న‌పూర్ణ స్టూడియోస్-రామ‌కృష్ణ స్టూడియోస్- సార‌థి స్టూడియోస్ ప‌రిశ్ర‌మ త‌ర‌లింపులో ప్ర‌ముఖ పాత్ర పోషించాయి. ఇక మూవీ మొఘ‌ల్ వంద‌లాది చిత్రాల్ని నిర్మించి ఎంద‌రికో అవకాశాలివ్వ‌డం వ‌ల్ల‌నే ప‌రిశ్ర‌మ ఇంతింతై అన్న చందంగా ఎదిగింది. ఇక రామానాయుడు జీవించి ఉన్న చివ‌రి రోజుల్లో ఆయ‌న‌కు ఒక కోరిక ఉండేది. ద‌గ్గుబాటి కుటుంబ క‌థా చిత్రం తీయాల‌ని అందులో చైతూ కూడా ఉండాల‌ని అనుకునేవార‌ట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా  ఆయ‌న కుమారుడు ద‌గ్గుబాటి సురేష్ బాబు వెంకీ మామ వేదిక‌ల‌పై చెబుతుండ‌డం ఆస‌క్తిక‌రం. విక్ట‌రీ వెంక‌టేష్‌- నాగ‌చైత‌న్య‌- రానా క‌లిసి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌న్న‌ది దివంగ‌త నిర్మాత డి. రామానాయుడి లాస్ట్ విష్‌. ఆ ముచ్చ‌ట‌ ఆయ‌న వుండ‌గానే జ‌రిగిపోవాల‌ని.. దాని కోసం ఎంతైనా ఖ‌ర్చు చేయాల‌ని భావించారట‌. చాలా సార్లు చాలామంది ర‌చ‌యిత‌ల్ని అందుకు త‌గ్గ క‌థ‌ని సిద్ధం చేయ‌మ‌ని చెప్పారు కూడా. కానీ క‌థ ఏదీ కుద‌ర‌లేదు. ఇంత‌లో ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యి... తిర‌గి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఆయ‌న కోరిక‌ని తీర్చాల‌ని త‌న‌యులు విక్ట‌రీ వెంక‌టేష్‌- నిర్మాత డి. సురేష్‌బాబు చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు.

చివ‌రికి మామా అల్లుళ్ల‌ని ఒకే తెర‌పై చూసుకోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం వెంకీమామ సినిమాతో ఫ‌లించింది. అప్ప‌టికీ చైతూ వ‌రుస చిత్రాల్ని అంగీక‌రించ‌డంతో సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో సినిమా చేయ‌డానికి చైతూకు స‌మ‌యం ప‌ట్టింది. ముందు అంగీక‌రించిన క‌మిట్ మెంట్ లు పూర్తి కావ‌డంతో `వెంకీమామ‌` సెట్స్‌పైకొచ్చింది. అక్క‌డి నుంచి ముద్దుల అల్లుడి కోసం ఇద్ద‌రు మామ‌లు హంగామా మామూలుగా లేదు. తండ్రి విష్ ని నెర‌వేరుస్తూ మేన‌ల్లుడికి `వెంకీమామ‌` రూపంలో భారీ గిఫ్ట్ ని సిద్ధం చేశారు. అలా దివంగ‌త రామానాయుడు క‌ల‌ని నిజం చేశారు. ఇక వెంకీమామ ప్రీరిలీజ్ వేదిక‌పై వెంకీ- చైతూ సంద‌డి పీక్స్ లో అల‌రించింది. వెంకీమామ అయితే మునుపెన్న‌డూ లేనంత జోష్ చూపించారు మ‌రి.


Tags:    

Similar News