సమంతా ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' కి మంచి రెస్పాన్సే వచ్చింది కానీ సినిమాకు మ్యూజిక్ వీక్ అనే కామెంట్లు వినిపించాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని మ్యూజికల్ కాంటెస్ట్ ఎపిసోడ్ తేలిపోయిందని.. అదే కనుక ఆ ఎపిసోడ్ లో ఒక చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిర్మాత డీ. సురేష్ బాబు కూడా అప్సెట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.
మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించిన సమయంలో విదేశాలలో ఉండడంతో 'ఓ బేబీ' సంగీతం విషయంలో పెద్దగా చర్చలకు.. మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా పోయిందని మిక్కీపై సురేష్ బాబు గుర్రుగా ఉన్నారట. సంగీతం ప్రధానం అయిన చిత్రానికి సంగీతం నిరాశ కలిగించే స్థాయిలో ఉండడం ఆయనకు నచ్చలేదట. అయితే ఈ సినిమాకు మిక్కీ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వలేకపోవడం ఒక మైనస్సే కానీ అదొక్కటే సినిమాకు వీక్ పాయింట్ కాదు.. స్క్రిప్ట్ లోని రెండు మూడు ఇతర అంశాలు కూడా సినిమా సక్సెస్ స్థాయిని తగ్గించాయి.
అయితే ఇక్కడ చాలామంది వ్యక్తం చేసే అనుమానం ఏంటంటే మిక్కీ వర్క్ స్టైల్ పై ఎప్పుడూ ఇలా విమర్శలు రాలేదు. ఇది మొదటి సారి. దీంతో ఈ కథనాలు నిజమేనా అనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ నిజమే అయితే.. సురేష్ బాబు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సినిమాకు వర్క్ చేస్తూ ఇలా సినిమా రిక్వైర్ మెంట్ కు తగ్గట్టు మ్యూజిక్ అందించలేకపోవడం సీరియస్ ఇష్యూనే. ఇలాంటివి మిక్కీ కెరీర్ కు మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.