కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన 24 ఫస్ట్ లుక్ ఇచ్చినప్పటి నుంచే ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడీ సినిమాకి టీజర్ ని కూడా ముందుగా చెప్పినట్లుగానే టైంకి రిలీజ్ చేశారు. ఈ మూవీలో టైం కూడా కీలకం కావడంతో.. ప్రతీ డీటైల్ ని ముందే టైం చెప్పి మరీ ఇస్తున్నారు యూనిట్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న 24కి.. ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం.
24లో సూర్య 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి సైంటిస్ట్ రోల్ అయితే, రెండోది రఫ్ గా విలన్ గా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు కవలలు అనే విషయాన్ని టీజర్ రోలనే రివీల్ చేసేశారు. ఇక ఓల్డేజ్ గెటప్ లో మరో రోల్ లో కనిపిస్తున్నాడు సూర్య. ఇచ్చిన విజువల్స్ ప్రకారం.. ఇది కాలంలో జర్నీ చేసే సినిమా అని ఓపెన్ గా చెప్పకపోయినా.. పాత కాలాన్ని, కొత్త తరాన్ని చూపించడం చూస్తే మాత్రం.. కాన్సెప్ట్ అర్ధమవుతుంది. 24లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించే. బొగ్గు ఇంజన్లతో మాత్రమే రైళ్లు నడిచే కాలాన్ని చాలా ఒరిజినల్ గా చూపించగలిగారు. కెమేరా పనితనం కూడా ఆకట్టుకుంది. ఇక ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ అయితే.. ఉర్రూతలు ఊగిస్తుంది.
సూర్య తన సొంత బేనర్ లోనే ఈ మూవీని నిర్మించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించారు. ఇష్క్, మనం చిత్రాలను తీసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ 24 ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించాడు.
Full View