దేవి శ్రీ ప్రసాద్.. టాలీవుడ్ లో అందరూ రాక్ స్టార్ గా పిలుస్తారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన దేవికి ఫాలోయింగ్ ఓ రంజీలో ఉంటుంది. కథకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం డిఎస్పి కి వెన్నతో పెట్టిన విద్య. రంగస్థలం సినిమా 1985 బాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఈ సినిమాకోసం 80 ఏళ్ల నాటి క్లారినెట్ అనబడే ఒక ఇన్స్ట్రుమెంట్ ను వెలికి తీసి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.
అది రంగమ్మా మంగమ్మా పాట అయినా, జిగేలు రాణి పాట అయినా ఇప్పుడు యువతను ఒక ఊపు ఊపుతోంది సినిమా ఆడియో. ఆ పాటలకు ప్రేక్షకులే కాదు సెలెబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారట. స్వయంగా తనకు కాల్స్ మెస్సేజెస్ పెడుతున్నారని చెప్పాడు దేవి. "సినిమాకి నేనిచ్చిన ఫోక్ మ్యూజిక్ చాలా బావుంది అని అల్లు అర్జున్ కాల్ చేశాడు. కొన్ని గంటల పాటు సినిమా సంగీతం గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం." అంతే కాదు కేటీఆర్ కూడా స్వయంగా మెచ్చుకున్నారట.
"కేటీఆర్ నుండి కూడా మెస్సేజ్ వచ్చింది. ఆయన మెప్పుపొందటం చాలా ఆనందంగా అనిపించింది. సూర్య కూడా బాష రాకపోయినా పాటలు బావున్నాయి అని చెప్పాడు" అంటూ వాళ్ళ అభినందనలను ప్రేక్షకులతో పంచుకున్నాడు దేవి. మొత్తానికి ఫాన్స్ తో మాత్రమే కాదు సెలెబ్రెటీలను సైతం తనకు ఫాన్స్ గా చేసేసుకుంటున్నాడు డిఎస్పీ.