ప్రేక్షకుల కోసం ఎప్పుడూ ఏదో కొత్తగా చేయాలని తపించే నటుడు సూర్య. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నం చేస్తూనే ఉంటాడతను. గత మూణ్నాలుగేళ్లలో వరుసగా ఫ్లాపులు ఎదురైనా సరే.. అతను ప్రయోగాలు ఆపలేదు. తాజాగా ‘24’ లాంటి రిస్కీ ప్రాజెక్ట్ చేశాడు. ఆ సినిమాను తనే స్వయంగా నిర్మించాడు కూడా. అతడి ప్రయత్నం వృథా కాలేదు. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బయిపోతూ ప్రేక్షకులకు ప్రేమగా ఓ లేఖ రాశాడు సూర్య. అందులో అతనేమన్నాడంటే...
‘‘24 సినిమా మీద మీరు కురిపిస్తున్న ప్రేమ.. ప్రశంసలు.. చూసి పరవశించిపోయా. మా 2డి ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు ఇది చాలా పెద్ద అడుగు. టైమ్ ట్రావెల్ నేపథ్యాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ చాలా సింపుల్ గా నరేట్ చేశాడు. అతను సినిమా ఆరంభమవ్వడానికి ముందే చాలా హోం వర్క్ చేశాడు. వాచ్ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని మలిచాడు. ప్రేక్షకులకు అది సరిగ్గా చేరుతోంది. నా సహ నటీనటులు - టెక్నీషియన్లకు.. ప్రొడక్షన్ టీంకు ఈ సందర్భంగా కృతజ్నతలు చెబుతున్నా. ప్రతి సన్నివేశంలోనూ వాళ్లందరి భాగస్వామ్యం ఉంది.
ఏ ఒక్క పాత్రకో కాకుండా నేను పోషించిన మూడు పాత్రలకూ ఒకేరకమైన స్పందన వస్తుండటం నాకు చాలా చాలా సంతోషాన్నిస్తోంది. ఈ సినిమాను తాను మనసుతో చేస్తున్నామని విక్రమ్ అనేవాడు. ఇప్పుడు మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను’’ అంటూ ‘మీ మీద ప్రేమ - గౌరవంతో మీ సూర్య’ అని లేఖను ముగించాడు సూర్య.