ఒకప్పుడు సూర్యకు దాదాపు 15 కోట్ల మార్కెట్ ఉండేది తెలుగులో. బ్రదర్స్ సినిమాకు ఆ రేటు పలికింది. కానీ వరుస ఫ్లాపులతో క్రమక్రమంగా అతడి హవా తగ్గిపోయింది. సూర్య లాస్ట్ మూవీ ‘రాక్షసుడు’ పది కోట్లు కూడా పలకలేదు. సినిమాను తక్కువకే కొన్నా. పెట్టుబడి తిరిగి రాలేదు. ఇప్పుడిక సూర్య కొత్త సినిమా ‘మేము’ అయితే కనీసం అమ్ముడుబోని పరిస్థితి. ఇది రెగ్యులర్ మూవీ అయితే ఈ పరిస్థితి ఉండేది కాదు కానీ.. పిల్లల సినిమా కావడం.. పైగా సూర్యది గెస్ట్ రోల్ మాత్రమే కావడంతో తెలుగులో అస్సలు బిజినెస్ కావట్లేదు. క్రిస్మస్ ముందు రోజు తమిళంలో ఈ సినిమా విడుదలైంది. మంచి టాకే తెచ్చుకుంది.
కానీ తెలుగులో మాత్రం ‘మేము’ విడుదల కాలేదు. క్రిస్మస్ కి ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. దీనికి తోడు సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం వల్ల కూడా సినిమాకు మోక్షం కలగలేదు. ఇక తర్వాతి వారం కూడా మూడు సినిమాలు వరుసలో ఉన్నాయి. కుదిరితే జనవరి 1కి, సంక్రాంతికి మధ్యలో వచ్చే వీకెండ్లో సినిమాను రిలీజ్ చేసుకోవాలేమో. అప్పటికి కూడా బిజినెస్ అయితేనే సినిమా రిలీజవుతుంది. లేదంటే డబ్బింగ్ ఖర్చులు కూడా వెనక్కి వచ్చే అవకాశముండదు. సూర్య, అమలా పాల్ లాంటి తారలు నటించిన సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడమేంటో?