ఓవైపు వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెడుతున్నాయ్. అయినా అతడు ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలకు కమిటవుతూ అంతకంతకు వేడి పెంచుతూనే ఉన్నాడు. తమిళ్- తెలుగు ద్విభాషా చిత్రాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నాడు. ఇప్పటికిప్పుడు వరుసగా ముగ్గురు నలుగురు దర్శకులు వినిపించిన స్క్రిప్టులు ఓకే చేశాడు.
తొలిగా వీటి నుంచి `కాప్పాన్` అనే భారీ మల్టీస్టారర్ రిలీజ్ కి వస్తోంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సుధ కొంగర దర్శకత్వంలో `సూరరై పోట్రు` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్.గోపీనాథ్ బయోపిక్ అని ప్రచారం అవుతోంది. అలాగే అజిత్ కి విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన `దరువు` శివకు ఓ సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చారట. దీనిని జ్ఞానవేల్ నిర్మిస్తారు.
ఈలోగానే `సింగం` సిరీస్ దర్శకుడు హరికి సూర్య ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ 2డి ఎంటర్ టెయిన్ మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే హరి తెరకెక్కించిన `సింగం` ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించినా మూడో చిత్రం మాత్రం ఫెయిలైంది. అందుకే ఈసారి కథ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. హరి అంటే భారీ యాక్షన్ కాప్ డ్రామాల స్పెషలిస్ట్. మరి ఈసారి ఎలాంటి కొత్త కథతో వస్తారో వేచి చూడాల్సిందే. సూర్య లో ఇటీవల ఓ కన్ఫ్యూజన్ మాత్రం స్పష్ఠంగా కనిపిస్తోంది. అతడు బహుభాషా చిత్రాలకు కథల్ని ఎంపిక చేసుకోవాలనుకోవడంలోనే తడబడుతున్నారు. ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్నది చూడాలి.